గ్లోబుల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఉంది. ఎస్ఎస్ రాజ‌మౌళి(SS Rajamouli), సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ప్రధానపాత్రలో న‌టిస్తుండ‌గా.. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ప్రియాంకాచోప్రా షూటింగ్ అనంత‌రం న్యూయార్క్ న‌గ‌రానికి బ‌య‌లుదేరింది. వైజాగ్, ముంబై మీదుగా న్యూయార్క్‌కు వెల్తూండగా.. ప్రియాంకాకు జ‌రిగిన‌ ఒక ఆస‌క్తిక‌ర సంఘటనను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

కారులో వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళుతుండ‌గా.. రోడ్డు పక్కన జామ‌ప‌ళ్లు(Guava Seller) అమ్ముతున్న ఒక మహిళ నాకు క‌నిపించింది. నాకు జామ‌ప‌ళ్లు అంటే చాలా ఇష్టం. దీంతో ఆ మ‌హిళ వ‌ద్ద ఆగి ఎంత అని అడిగాను ఆమె రూ.150 అని చెప్పింది. నేను 200 ఇచ్చాను. అయితే ఆమె ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక‌పోవ‌డంతో మిగిలిన డబ్బు తన వద్దే ఉంచుకోమ‌ని చెప్పాను.

కానీ ఆ మ‌హిళ దాన్ని తీసుకోవడానికి నిరాకరించి.. చిల్లర ఇవ్వడానికి ప్రయత్నించింది. టైంకి చిల్ల‌రి లేక‌పోవ‌డంతో వెంట‌నే వెళ్లి ఇంకో రెండు జామ‌ప‌ళ్లు తీసుకువ‌చ్చి నాకు ఇచ్చింది. ఈ విష‌యం న‌న్ను ఎంత‌గానో క‌దిలించింది.

ఈ మహిళ జామ‌ప‌ళ్లు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఉచితంగా వ‌చ్చేదానిని ఆమె కోరుకోలేదు. క‌ష్టపడి పనిచేసే ఈ మహిళ నా మ‌న‌సును గెలుచుకుందంటూ ప్రియాంకా రాసుకోచ్చింది.

, , , ,
You may also like
Latest Posts from