రీసెంట్ గా మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కి కౌశాల్ శంభాజీ పాత్రను, యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించారు. ఈ సినిమా కలెక్షన్స్ తో పాటు వివాదాలు తెచ్చిపెడుతోంది. తాజాగా ఈ సినిమా ప్రభావంతో పెద్ద వివాదమే చెలరేగింది. ఈ గొడవకు సంభందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో శంభాజీ నగర్ జిల్లాలో ఖల్దాబాద్ జిల్లాలో ఔరంగాజేబ్ సమాధి ఉంది. అయితే.. ఇప్పటికే దీన్ని తొలగించాలని కూడా పలువురు నేతలు డిమాండ్ చేశారు.

కొన్నిరోజులుగా ఔరంగాజేబ్ సమాధి వివాదం మహరాష్ట్రలో వివాదాస్పదంగా మారింది. దీనిపై తొలించాలని డిమాండ్ లు భారీగా వస్తున్నాయి.

ఇప్పటికే ఔరంగాజేబ్ సమాధిని తొలగించాలని వీహెచ్ఫీ ప్రభుత్వానికి లేఖలు సైతం రాసింది. ఈ నేపథ్యంలో ఔరంగాజేబ్ సమాధి అంశంలో నాగ్ పూర్ లో పలు ప్రాంతాలలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది.

ముఖ్యంగా.. కొత్వాలి, గణేశ్ పేట్, లకడ్ గంజ్, పచ్చా వులి, శాంతి నగర్, సక్కర్ దర, నందన్ వన్, ఇమామ్వాడ, యశోధర, కపిల్ నగర్ లలో చాలా గొడవలు జరిగాయి.

నిన్న రాత్రి… నాగ్ పూర్ లోని హంసపురిలో రెండు వర్గాలు కొట్టుకున్నారు. దీనిలో 20 మంది గాయపడ్డారు.

నాగ్ పూర్ లోని పలు ప్రాంతాలలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరు కూడా బైటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

, , ,
You may also like
Latest Posts from