గతేడాది డిసెంబరులో విడుదలలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్కో’.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 100 కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హనీష్ అదేని డైరెక్షన్‌కు ఉన్ని ముకుందన్ నటన తోడు కావడంతో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘మార్కో’ మూవీ చిత్ర దర్శకుడు హనీఫ్ అదేనితో ఓ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు.
శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించనున్న ఈ కొత్త చిత్రాన్నిరీసెంట్ గా ప్రకటించారు. ఈ సినిమా హై వోల్టేజ్ మల్టీ స్టారర్ అని చెప్తున్నారు. అందుకు భారీ బడ్జెట్ , ప్యాన్ ఇండియా రిలీజ్ అంతా సిద్దమే కానీ సినిమాకు ఊహించని ఓ సమస్య వచ్చేలా ఉందని అంటున్నారు.
ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు..? అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని వినపడుతోంది. కథకు అవసరమైన ఇద్దరు ప్రధాన హీరోల ఎంపికపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. తెలుగు పరిశ్రమలో ఉన్న టాప్ లీగ్ హీరోల్ని టార్గెట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఒకవేళ ఇద్దరూ తెలుగు లోని టాప్ హీరోలే అయితే, సినిమా పరిమిత భాషల్లోనే విడుదల చేయాలి నిర్మాతలు. కానీ ఒకరు బాలీవుడ్ నుంచి ఉంటే, లేదా తమిళం, మలయాళం నుంచి ఎవరైనా నటిస్తే మాత్రం నేరుగా పాన్ ఇండియా రిలీజ్‌కి వెళ్లే అవకాశం ఉంది. దిల్ రాజు ఇప్పుడు ఎటు వెళ్లాలా, ఎవరు డేట్స్ ఇస్తారనే విషయమై చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. దానికి తోడు తెలుగులో ఏ స్టార్ హీరో ఖాళీగా లేడు.ఎంత దిల్ రాజు వచ్చి అడిగినా డేట్స్ ఇచ్చేలా లేరు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ..‘‘మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్‌తో హై బడ్జెట్‌తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిల్మ్‌ని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీతో హనీఫ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురు ఫిల్మ్స్ సునీత తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని పేర్కొన్నారు.