

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ కాంతార ’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అద్బుత నటనకు గాను రిషబ్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. దేశాన్నే షేక్ చేసిన ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘ కాంతార చాప్టర్ 1 ’ని తెరకెక్కించాడు రిషబ్.
ఈ ఏడాది ప్రేక్షకులను పిచ్చెక్కించబోయే ఇండియన్ సినిమా ఏదైనా ఉందంటే అది కాంతార: చాప్టర్ 1 అనేలా ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. థియేట్రికల్ డీల్స్ కోసం నిర్మాతలు ఇప్పటికే భారీ మొత్తాలను కోట్ చేస్తున్నారు.
హోంబలే ఫిలిమ్స్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ బడ్జెట్ పెట్టుబడులు పెట్టింది. గతంలో మాదిరిగానే, ఈసారి కూడా డిస్ట్రిబ్యూటర్ల నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకుని స్వయంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. KGF , కాంతార , మహావతార్ నరసింహ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత, ఇప్పుడు కాంతార: చాప్టర్ 1 థియేట్రికల్ రైట్స్ కోసం రేస్ తారాస్థాయికి చేరింది.
ఈ మూవీని 30కిపైగా దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ ఇలా పలు భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది.
తెలుగు రాష్ట్రాల్లో : మైత్రి మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, సాయి కొర్రపాటి & ఇతర టాప్ డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తున్నారు.
నార్త్ ఇండియా : AA ఫిలిమ్స్
కేరళ : పృధ్విరాజ్ ప్రొడక్షన్స్
కర్ణాటక : హోంబలే ఫిలిమ్స్ స్వయంగా
తమిళనాడులో : భారీ డిమాండ్! ఇంకా ఫైనల్ కాలేదు
రిలీజ్ కాకముందే ఈ మూవీ నిర్మాతలకు మైండ్ బ్లోయింగ్ ప్రాఫిట్స్ రాబడుతుందని టాక్. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యాగ్నం ఓపస్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈసారి కాంతార: చాప్టర్ 1 సెట్ చేసిన టార్గెట్… ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే!