త్రిష పెళ్లి వార్తలు ఎప్పుడూ మీడియాకు హాట్ టాపిక్కే. నలభైలు దాటిన ఆమె పెళ్లి విషయంలో తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ రూమర్లు గానే మిగిలిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చాయి. దీనికి కారణం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటో.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెడిషినల్ ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె ఆకుపచ్చ రంగు చీరలో ఎంతో అందంగా కనిపించింది. ఇక శారీ కలర్ కు మ్యాచింగ్ గా మెడలో నెక్లెస్, చేతికి ఉంగరం ధరించి అచ్చం అతిలోక సుందరిలా కనిపించింది. ఈ ఫొటోలకు ‘ ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.

త్రిష షేర్ చేసిన ఈ పోస్ట్, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ క్యాప్షన్ ప్రకారం ఆమె ప్రేమ ఫలించి ఏదైనా గుడ్‌న్యూస్ జరిగిందా? అని ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.

ఈ చెన్నై చంద్రం ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో కనువిందు చేయనుంది.

You may also like
Latest Posts from