మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రతిష్టాత్మకంగా ‘విశ్వంభర’ (Vishwambhara) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్..లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం సినిమాని వాయిదా వేస్తున్నట్లు టీం చెప్పింది.

ఇక తర్వాత సమ్మర్ కి రిలీజ్ అన్నారు. ఇప్పుడు అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు అని తెలుస్తుంది. మరి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేదానికి ఓ డేట్ కు టీమ్ ఫిక్స్ అయ్యిందని సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ ఇంద్ర రిలీజ్ డేట్ జూలై 24న విశ్వంభర రిలీజ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారట. మరి దీనిపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే ఏమీ లేదు.

చిరంజీవి – వ‌శిష్ట కాంబోలో రూపొందిన సినిమా ఇది. త్రిష హీరోయిన్. యూవీ క్రియేష‌న్స్ నిర్మించింది. రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. రిలీజ్ డేట్ కు టైమ్ ఉండటంతో ఈ గ్యాప్ లో వీఎఫ్ఎక్స్‌పై మ‌రింత క‌స‌ర‌త్తు చేసే అవ‌కాశ‌మూ ద‌క్కుతుందంటున్నారు.

, , , ,
You may also like
Latest Posts from