బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నేళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ, చిత్రాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ, తెలుగులో మాత్రం చేతికొచ్చిన ప్రాజెక్ట్స్ కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మూవీలో పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేశారు. ఓ పాన్ ఇండియా సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా కనిపించనున్నారు.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం — ఈ సినిమాకి పూజా హెగ్డే దాదాపు ₹3 కోట్లు పారితోషికంగా అందుకోబోతుందట.

ఒక బలమైన, ఎమోషనల్ రేంజ్ ఉన్న పాత్రలో కనిపించనున్న పూజా, దుల్కర్ సల్మాన్‌తో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీలో అదరగొట్టబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. “పూజా ఈ పాత్రతో యాక్టింగ్ పరంగా కూడా మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేయబోతోంది. భారీ పేమెంట్ + పవర్‌ఫుల్ రోల్ – రెండు చేతులా లాభం!” అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల సూర్యతో ‘రెట్రో’లో నటించిన ఆమె, విజయ్ హీరోగా వస్తున్న ‘జన నాయగన్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. అంతేకాదు, రజనీకాంత్ సినిమాలో “మోనికా” స్పెషల్ సాంగ్‌తో కూడా పూజా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇంతకుముందు పూజా టాలీవుడ్‌లో ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోలతో జోడీగా మెరిసింది. ఇప్పుడు ఆ లిస్టులో దుల్కర్ సల్మాన్ కూడా చేరడంతో — ఆమె సౌత్ సినీ ప్రాభవం మరింత పెరిగినట్టే.

తెలుసుకున్న సమాచారం ప్రకారం — “పూజా కొన్ని చిన్న హీరోల ప్రాజెక్టులను ఇంతవరకు తిరస్కరించింది. బ్రాండ్ వాల్యూ కాపాడుకోవడమే కారణం. కానీ ఇప్పుడు బలమైన సబ్జెక్ట్‌తో టాలీవుడ్‌కి తిరిగి రాబోతుంది” అంటున్నారు వర్గాలు.

ఇండస్ట్రీ టాక్: పూజా రీ-ఎంట్రీతో టాలీవుడ్ హీరోయిన్ రేసులో మళ్లీ వేడి పెరిగింది! . రష్మిక మందన్న, శ్రీలీల, మృణాల్ ఠాకూర్‌లకు కాంపిటీషన్‌గా పూజా హెగ్డే తిరిగి రంగంలోకి!

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ #DQ41లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

SLV సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఆయన కెరీర్ లో 41వ చిత్రం. ప్రస్తుతానికి #DQ41 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. చాలా రోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా.. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది.

, , , , , ,
You may also like
Latest Posts from