న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇక హిట్ ఫ్రాంచైజీలో ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ అంటోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లోనే నిర్మించాడు నాని. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అడివి శేష్, కార్తీ కేమియో రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ న్యూస్ రాకపోయినా వచ్చిన వార్తలను ఖండించలేదు టీమ్. మే 1న విడుదల కాబోతోన్న హిట్ 3పై భారీ అంచనాలున్నాయి అనేది నిజం. రీసెంట్ గా నాని తను నిర్మించిన కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న జోష్ లో ఉన్నాడు. ఆ జోష్ ను ఈ మూవీ డబుల్ చేస్తుందని నమ్ముతున్నాడు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన మలయాళ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫారర్ ఫిలింస్ బ్యానర్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ గ్రాండ్ రిలీజ్ చేయనున్నాడు.

ఇక హిట్ వర్స్ చిత్రాలకు అక్కడ కూడా క్రేజ్ ఉండటంతో ఈ చిత్ర రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు అక్కడి ప్రేక్షకులు థ్రిల్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

గతంలో దుల్కర్ నటించిన ఓకే బంగారం అనే చిత్రంలో అతనికి నాని డబ్బింగ్ చెప్పాడు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది.

ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

, , , ,
You may also like
Latest Posts from