ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం సినిమా పరిశ్రమలో కేరాఫ్ గా మారిపోయింది. గ్లోబల్ మార్కెట్‌కు అడుగులు వేస్తున్న తెలుగు సినిమా, ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోల చేతిలోనూ అంతర్జాతీయ కలల్ని చూస్తోంది. అదే దిశగా అడుగుపెడుతున్నాడు విశ్వక్ సేన్. ఆయన తాజా సినిమా ‘కల్ట్’ — “పాన్ గ్లోబల్” అనే న్యూ ట్యాగ్‌లైన్‌తో ప్రకటించబడింది.
ఈరోజే ‘కల్ట్’ మూవీ పూజా కార్యక్రమాలు ముగించుకొని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దర్శకుడిగా విశ్వక్ సేన్, హీరోగా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుతో పాటు 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేయనున్నాడు విశ్వక్. మరో విశేషం — ఈ స్క్రిప్ట్‌కు తరుణ్ భాస్కర్ డైలాగ్స్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఒక మిడియం బడ్జెట్ సినిమాకు ఇది గట్టి టెక్నికల్ బ్యాకింగ్.
‘కల్ట్’ ఓ యాక్షన్ థ్రిల్లర్. కానీ ఇప్పటిదాకా చూసిన తరహా కాకుండా, ఫ్రెష్ ట్రీట్మెంట్‌తో వస్తుందని విశ్వక్ హామీ ఇస్తున్నాడు. జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంటే, గ్లోబల్ స్టెప్స్‌ను నిజంగా గట్టిగా వేస్తున్నాడు.
వాస్తవానికి విశ్వక్ ఈ సినిమాలో నటించకూడదనుకున్నాడట. దర్శకత్వానికే పరిమితమవుదామని అనుకున్నప్పటికీ… చివరికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకెళ్లాల్సి వచ్చింది. 40 మంది కొత్త టాలెంట్‌ను ఆడిషన్ల ద్వారా ఎంచుకోవడం ద్వారా కూడా, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న సీరియస్‌నెస్ స్పష్టమవుతోంది.
ఇటీవలి విడుదల ‘లైలా’ మూవీ, విమర్శలతో ఎదురుదెబ్బ తిన్న సంగతి తెలిసిందే. అడల్ట్ కంటెంట్ మోతాదు అధికమైందని, చరిత్రలో బూతు డైలాగ్స్ ఎక్కువగా ఉన్న సినిమాగా విమర్శలు వచ్చాయి. దాంతో విశ్వక్ ‘సారీ’ చెప్పి, ఇకపై అందరికీ నచ్చే సినిమాలే చేస్తానన్న మాట ఇచ్చాడు.
ఇప్పుడు ఆ హామీని నిలబెట్టే ప్రయత్నంగా ‘కల్ట్’ కనిపిస్తోంది. కాన్సెప్ట్ కొత్తదట. కథనం డిఫరెంటట. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్టూ కనిపిస్తోంది.
ఇకనైనా విశ్వక్ ట్రాక్‌లోకి వస్తాడా? ‘కల్ట్’ విజయం సాధిస్తే అతని కెరీర్ మళ్ళీ పుంజుకుంటుందా? — ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం పెద్ద తెరమీదే లభించనుంది!