2023లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ యూత్ బాగా ఓన్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో వెంకటేశ్ – రానా దగ్గుబాటి ల కలయిక, మాస్ అటిట్యూడ్, గ్రిప్‌తో కూడిన క్రైమ్ డ్రామా – అన్నీ కలిసి ఈ సిరీస్‌ను ఇండియన్ ఓటీటీలో ఓ సెన్సేషన్‌గా నిలిపాయి.
అయితే, ఇందులో అధికంగా ఉన్న శృంగార సన్నివేశాలు, బోల్డ్ డైలాగ్స్ కొన్ని వర్గాల్లో విమర్శలకు దారి తీసాయి. అయినా, ఇది నెట్‌ఫ్లిక్స్‌లో హైయెస్ట్ స్ట్రీమ్డ్ ఇండియన్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.
ఈ క్రేజీ సక్సెస్ తర్వాత ఇప్పుడు వస్తోంది ‘రానా నాయుడు – సీజన్ 2’. అమెరికన్ టీవీ సిరీస్ ‘Ray Donovan’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ ఇక జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
గత సీజన్‌పై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు వెంకటేశ్ వెల్లడించారు. ఈసారి సిరీస్ బోల్డ్ కంటెంట్ తగ్గించి, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, హ్యూమన్ కంఫ్లిక్ట్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టారట. సీజన్ 1 కన్నా ఇదే పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకంతో యూనిట్ ఉన్నట్టు సమాచారం.
ఇక చూడాలి… రానా-వెంకీ మళ్లీ ఎలా దుమ్ము రేపతారో!