ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆయన స్పెషల్ డే కావటంతో “వార్ 2” టీజర్ రిలీజ్ గురించి సినిమా టీమ్ నాలుగు రోజుల క్రితం ప్రకటించింది. ఎన్టీఆర్ హిందీ సినిమాలో ఎలా కనిపిస్తాడో, హృతిక్ రోషన్‌తో వార్ ఎలా ఉండబోతుందో ఈ రోజు ఉదయం వరకు అభిమానులు, సినీ విశ్లేషకులు ఎన్నో ఊహలు వేసుకున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక సారీ, ఫోకస్ పూర్తిగా వేరే దిశలోకి మారిపోయింది.
టీజర్‌లో కేవలం కొన్ని సెకన్లపాటు కియారా అద్వానీ కనిపించింది. కానీ ఆ చిన్న సమయంలోనే ఆమె అందరిని మెస్మరైజ్ చేసింది. వెండితెరపై మొదటిసారి బికినీ ధరించి రచ్చ రేపింది! సోషల్ మీడియాలో మీమ్స్ కురుస్తున్నాయి. కియారా బహుశా టీజర్‌లో ‘అవుట్ ఆఫ్ సిలబస్’ లా రాని ఫ్యాక్టర్ అయిపోయింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ యాక్షన్ చిత్రాల్లో హీరోలు సిక్స్ ప్యాక్, ఫిట్‌నెస్ షో చేస్తారంటే మనకు చాలా బాగా తెలిసిన విషయం. అలాగే, హీరోయిన్‌లకు బికినీ షాట్ పెట్టడం కూడా ఇక్కడ సాధారణమే. కానీ కియారా అద్వానీ ఇలా స్పాట్‌లైట్ మెయిన్ విషయాన్నే దెబ్బతీసేలా బికినీలో ఫస్ట్ టైమ్ కనిపించడం, నెటిజన్ల దృష్టిలో హైలైట్ అయింది.