సినిమా వార్తలు

త్రిష పెద్ద ముదురా…రూమర్స్ తో కెరీర్ నిలబెట్టుకుంటోందా?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి వాస్తవాలకంటే ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. వాటిలో నిజమెంతో తెలీదు కానీ, కొన్ని రూమర్స్ సెలబ్రిటీల కెరీర్‌ను బజ్‌లో ఉంచేందుకు ఉపకరిస్తాయి. డిక్లైన్‌లో ఉన్న నటీనటులు — కావాలనే కొన్ని పర్సనల్ రూమర్స్‌ను లైవ్‌లో ఉంచుతారు. కొన్నిసార్లు సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా, ఇంకొన్నిసార్లు మీడియాకు పరోక్షంగా “ఫీడ్” చేస్తూ — న్యూస్‌ వర్క్‌నే తామే డిజైన్‌ చేస్తారు.

ఇప్పుడు త్రిష విషయంలో ఇదే జరిగింది అనిపిస్తోంది. ఇటీవల ఆమె వేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, ‘When you’re full of love, it confuses people who are full of shit’ అనే వాఖ్యంతో… మళ్ళీ విజయ్‌తో ఉన్న రూమర్స్‌కు నిప్పు పెట్టింది. ఇది యాదృచ్ఛికంగా వచ్చిందా? లేక తాను మళ్ళీ హెడ్లైన్స్‌లో ఉండేందుకు డిజైన్ చేసిన పబ్లిసిటీ స్టంటా? అనేది పెద్ద చర్చ అయింది.

త్రిష–విజయ రూమర్స్ మళ్ళీ హాట్ టాపిక్:

తెలుగు, తమిళ పరిశ్రమల్లో రెండు దశాబ్దాల పైగా కొనసాగుతున్న త్రిష… ఇప్పటికీ రూమర్స్‌తో సర్ఫేస్‌లో ఉంటోంది. గతంలో ఆమెను అనేక మంది హీరోలతో లింక్ చేశారు. కానీ ఇప్పుడు, తన కెరీర్ చివరి దశలో కూడా ఆమె పేరు స్టార్ హీరో విజయ్‌తో జత కడుతూ మీడియాలో తిరుగుతోంది.

‘గోట్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించడం, రీసెంట్‌గా విజయ్ బర్త్‌డేకు ఇచ్చిన సోషల్ మీడియా విషెస్ — “He is my best friend” అనే కామెంట్ — ఇవన్నీ రూమర్లకు మరింత ఇంధనం చల్లినట్లయ్యాయి.

రూమర్లను స్మార్ట్‌గా వాడుకునే సెలబ్రిటీలు:

ఇలాంటి సందర్భాల్లో కొన్ని సెలబ్రిటీలు “వాదన వద్దు – కాన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ” అనే ఫార్ములా పాటిస్తారు. రూమర్‌పై క్లారిటీ ఇవ్వకుండా, రూమర్ కంటెంట్ ఉన్నట్టే ఉండేలా మల్టిపుల్ అర్థాలున్న పోస్టులు పెడతారు. ఇదే ఇప్పుడు త్రిష చేస్తున్నదా?

సినిమా పరంగా ఆమెకి వరుస ఫ్లాపులు వస్తున్న సమయంలో, “థగ్ లైఫ్” వంటి పెద్ద బడ్జెట్ సినిమాలో కూడా కనిపించటం, పర్సనల్ రూమర్స్‌తో ప్రచారంలో ఉండటం — ఇవన్నీ కలిపితే, త్రిష ఇంకొన్ని రోజులు వార్తల్లో ఉండేలా అనిపిస్తోంది.

త్రిష పోస్ట్ నిజంగానే ప్రేమని ప్రతిబింబించిందా?

ఆమె పోస్ట్ చేసిన మెసేజ్, ఒకదాని పైన ఒక వ్యాఖ్యలుగా పెరుగుతున్నాయి:

“When you’re full of love, it confuses people who are full of shit.”

ఇది నిజంగా ప్రేమతో నిండిన వ్యక్తిగా చెప్పిన మాటా? లేక ప్రత్యక్షంగా ఎవరికీ చెప్పకుండా పరోక్షంగా మీడియా దృష్టిని తన వైపు తిప్పే ప్రయత్నమా?

Similar Posts