మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకూ తనదైన నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు ఫహాద్. దేశంలోనే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో ఫహాద్ పేరు తప్పక ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫహాద్ చేసిన కొన్ని క్యారెక్టర్స్‌లో ఆయన్ను తప్ప వేరే నటుడ్ని కలలో కూడా ఊహించలేనట్లుగా పాత్రలో జీవిస్తారు ఫహాద్.
అయితే లాస్ట్ ఇయిర్ రిలీజైన పుష్ప 2 సినిమాలో ఫహాద్ పాత్రపై కొంత అసంతృప్తి అయితే అభిమానుల్లో ఉంది. పుష్పరాజ్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడం కోసం బన్వార్సింగ్ పాత్రను డౌన్‌గ్రేడ్ చేశారని విమర్శలున్నాయి.ఇప్పుడు ఫహాద్ కు కూడా అలాంటి అసంతృప్తి ఉందని తాజా కామెంట్స్ ని బట్టి అర్దమవుతోంది.
ఫహాద్ ఫాజిల్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన నూతన చిత్రం ‘మారీసన్’ జూలై 25న థియేటర్లలో విడుదలైంది. ఇదే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ‘పుష్ప 2’ గురించి డైరక్ట్ గా ప్రస్తావించకపోయినా, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దిశగా ఉన్నాయి అనే అభిప్రాయం నెటిజన్లది.
“గత ఏడాది నేను ఓ పెద్ద సినిమాతో ఫెయిల్ అయ్యాను. ఆ సినిమాను గురించి నేను మాట్లాడదలచుకోను. ఎవరైనా మీ చేతుల్లో లేని విషయాల్ని వదిలేయాల్సిందే…” – ఫహద్ వ్యాఖ్యలు.
ఈ మాటల్లో సినిమా పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా, ఆయన చెప్పేది సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప 2’ గురించే అన్నది స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఫహద్ ఇలా అసంతృప్తిని వ్యక్తం చేశారని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఫహాద్ ఫాజిల్ తాజాగా నటించిన ‘మారీసన్’ సినిమా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ రోడ్ ట్రిప్ మూవీ. ఆయనతో పాటు కామెడీ కింగ్ వడివేలు కూడా ముఖ్యపాత్రలో నటించగా, ఈ చిత్రం ‘మామన్నన్’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మళ్ళీ సినిమాగా నిలిచింది. దర్శకుడు సుధీష్ శంకర్ మళ్లీ వీరిద్దరిని తెరపై చేరుస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది.
ఇక ఫహాద్ ఫాజిల్ – పుష్ప 2 వ్యవహారం ఎటు వెళ్తుందో చూడాలి!