నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ‘తమ్ముడు’ సినిమా దిల్ రాజు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాజెక్ట్. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు తీవ్ర దెబ్బ తగిలింది. కలెక్షన్స్ లేవు, రివ్యూలన్నీ తిట్టిపోసాయి. అక్కడితో కథ ముగియలేదు. ఇప్పుడు తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ మొదలైన ‘తమ్ముడు’ ఓటీటీ వెర్షన్‌పై కూడా జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దిల్ రాజు బ్రాండ్, నితిన్, శ్రీరామ్ వేణు వంటి పేర్లతో ఓటీటీలో జనం కాస్త ఆసక్తిగా ఫిల్మ్ క్లిక్ చేస్తే… మొదటి 15 నిమిషాలకే చాలా మంది వెనక్కి వెళ్లిపోతున్నట్టే ఉందని కామెంట్లు వస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో మిక్కిలి డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ యాక్షన్ డ్రామా — ఓటీటీ ద్వారా మళ్లీ ట్రోలింగ్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓవైపు వినిపిస్తున్న కామెంట్లు:
“నితిన్ గత సినిమాలన్నీ ఈ సినిమా కన్నా ఎంతో బెటర్!”
“ఒక్క సీన్ కూడా బాగోలేదు… అసలు కథలో కనెక్షన్ లేనే లేదు!”
“ఇలాంటి కథతో దిల్ రాజు ఇంత బడ్జెట్ పెట్టాడంటే ఆశ్చర్యం!”
దిల్ రాజు అంతగా నమ్ముకున్న ఈ స్క్రిప్ట్ ప్రేక్షకులను ఎందుకు కనెక్ట్ చేయలేకపోయిందో అనే చర్చ మళ్లీ ప్రారంభమైంది. ప్రేక్షకుల్లో మాత్రం ఇప్పుడు ఒకే మాట — “తమ్ముడు” తలపట్టుకునే తిప్పలు! బాగానే ఉంది దిల్ రాజుకి మాత్రం తిట్ల వర్షం తప్పటం లేదు.