ఇప్పటి కాలంలో ప్రేక్షకుల ఓపిక పదిమందిలో ఒకరిలో ఉంటుందేమో అనిపించేంత స్థితి. సినిమా ఆసక్తికరంగా అనిపిస్తే గంటలేమీ గుర్తుకు రావు, కానీ కథ నత్త నడకగా ఉంటే, రెండు గంటల సినిమా కూడా యుగాల్లా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వార్ 2 డ్యూరేషన్ తెలిసినవెంటనే చాలా మంది కాసింత షాక్ అయ్యారు –
మొత్తం 2 గంటల 53 నిమిషాలు 23 సెకన్లు
అంటే దాదాపు మూడు గంటల సినిమా!
ఈరోజుల్లో ఓటీటీలు, షార్ట్ ఫార్మాట్ కంటెంట్ dominate చేస్తున్న సమయంలో, థియేటర్ లో మూడు గంటలు కూర్చోవడం అంటే అసలైన సవాలే. మరి ఈ సవాలను వార్ 2 తట్టుకుంటుందా లేక ప్రేక్షకులు మధ్యలోనే బోర్ కొట్టి బయటకి వెళ్లిపోతారా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.
కానీ ఇదే ట్రెండ్ లో “ఆర్ఆర్ఆర్”, “కేజీఎఫ్ 2” లాంటి సినిమాలు దాదాపు ఈ రేంజ్ లోనే ఉండి, స్టోరీ టెల్లింగ్ తీరుతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వార్ 2 కూడా అదే మాయ చేయగలదా?
ఒక్క మాటలో చెప్పాలంటే, “వార్ 2” ఎంత లెంగ్త్ ఉన్నదో కాక, ఎంత రీఫ్రెషింగ్‌గా అనిపిస్తుందో అనేదే ప్రేక్షకులను కట్టిపడేసే అసలైన బలంగా మారుతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి కాంబినేషన్, ప్యాన్ ఇండియా హైప్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటే, మూడు గంటలు కూడా తక్కువేనని అనిపించాల్సిందే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ లో స్పై యాక్షన్ మూవీ వార్ 2. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ కావడం, వార్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కావడంతో ఈ సినిమాపైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు జూనియర్ ఫ్యాన్స్. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.