బాలీవుడ్‌లో పాపులర్ లీగల్ కామెడీ ఫ్రాంచైజ్ జాలీ ఎల్ఎల్బీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి సినిమా ప్రమోషన్ కారణంగా కాదు… నేరుగా న్యాయస్థానం తలుపులు తట్టింది.

పుణెలోని సివిల్ కోర్టు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ , నటుడు అర్షద్ వార్సీ , దర్శకుడు సుభాష్ కపూర్ లకు సమన్లు జారీ చేసింది.

కారణం?
సినిమాలో న్యాయవ్యవస్థను అవమానించేలా, లాయర్లను సరదాగా చూపించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయన్న ఆరోపణ. ముఖ్యంగా జడ్జీలను “మామా” అని పిలిచే డైలాగ్‌పై లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాజేద్ రహీమ్ ఖాన్ అనే లాయర్ పిటిషన్ దాఖలు చేయగా, కేసు అధికారికంగా రిజిస్టర్ అయింది.

కోర్టు ఆదేశం ప్రకారం –
అక్టోబర్ 28 ఉదయం 11 గంటలకు అక్షయ్‌కుమార్, అర్షద్ వార్సీ, సుభాష్ కపూర్ కోర్టులో హాజరు కావాలి.

గమనించదగ్గ విషయం ఏమిటంటే…

  • 2013లో అర్షద్ వార్సీ హీరోగా వచ్చిన మొదటి భాగం సూపర్ హిట్.
  • 2017లో అక్షయ్‌కుమార్ నటించిన రెండో భాగం బ్లాక్‌బస్టర్.
  • ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి నటిస్తున్న మూడో భాగం సెప్టెంబర్ 19న రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ రిలీజ్‌కి ముందే ఈ కోర్టు వివాదం కొత్త అడ్డంకిగా మారింది.

ఫిర్యాదు దారుడు స్పష్టం చేస్తూ –

“జడ్జీలకు, న్యాయవాదులకు గౌరవం ఉండాలి. వారిని సినిమాల్లో హాస్యాస్పదంగా చూపించడం సమాజంలో తప్పు సందేశం ఇస్తుంది” అని వాదించారు. కోర్టు కూడా దీనిని సీరియస్‌గా తీసుకుంది.

ఇక అసలైన సస్పెన్స్:
అక్షయ్‌కుమార్, అర్షద్ వార్సీ, సుభాష్ కపూర్ నిజంగానే కోర్టులో హాజరవుతారా?
లేక రిలీజ్ డేట్ ముందే లీగల్ ట్విస్ట్ కారణంగా సినిమా ఆగిపోతుందా?

జాలీ ఎల్ఎల్బీ 3కు ఇది నిజంగా పెద్ద సవాల్!

, ,
You may also like
Latest Posts from