సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తూ, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లోనూ అదే జోష్ చూపిస్తున్న నందమూరి బాలకృష్ణ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పయ్యవుల కేశవ్ వెల్లడించారు.

అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ సభలో ఆయన మాట్లాడుతూ – “ఈ కార్యక్రమానికి నారా లోకేశ్, బాలయ్య ఇద్దరూ హాజరుకావాల్సింది. కానీ అనారోగ్యం కారణంగా బాలయ్య రాలేకపోయారు” అని తెలిపారు.

అయితే, బాలయ్యకు ఏమైందన్న దానిపై మాత్రం ఆయన ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది.

మరోవైపు, నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా రప్పించే పనుల్లో నారా లోకేశ్ నిమగ్నమై ఉన్నారని… సచివాలయం నుంచే నేపాల్ పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని పయ్యవుల తెలిపారు.

#Balakrishna, #Balayya, #Health Issue, #Payyavula Keshav, #super six super hit, #Tollywood

By admin