తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించిన‌ట్లు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన‌ట్లు స‌మాచారం. ఈ క్రమంలో ట్రేడ్ లో కొత్త చర్చ మొదలైంది. అదేమిటంటే…

టాలీవుడ్‌లో టాప్‌స్టార్స్‌ పక్కన పెడితే, నాని, విజయ్ దేవరకొండలే రెండో లైన్‌లో బలమైన మార్కెట్‌, బాక్సాఫీస్‌ మైలురాళ్లతో దూసుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ లైన్‌లోనే కొత్త శక్తిగా ఎంట్రీ ఇచ్చాడు తేజా సజ్జా .

‘హనుమాన్’ ఒక్క హిట్‌ అని చాలామంది అనుకున్నా… ‘మిరాయ్’తో తేజా గేమ్ రూల్స్‌నే మార్చేశాడు. బాక్సాఫీస్‌పై ఆగ్రెసివ్‌గా దూసుకెళ్తూ, వసూళ్లతో ట్రేడ్‌ వర్గాలను షాక్‌కి గురి చేస్తున్నాడు.

టాక్ ఏమిటంటే… మిరాయ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ₹100 కోట్లు దాటుతుంది అని. వరల్డ్‌వైడ్‌గా అయితే ₹150 కోట్లకు పైగా టార్గెట్‌ పెట్టుకున్నది. ఈ ఫీట్‌ తేజా సాధిస్తే, నాని – విజయ్ దేవరకొండలతో సహా ఏ టైయర్‌ 2 హీరో కూడా అందుకోని మైలురాళ్లను మొదటిసారిగా అందుకున్న హీరో అవుతాడు.

అదీ కాకుండా, మిరాయ్ రెండో రోజు అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెనింగ్ డే కంటే 30% ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీలో హీట్‌ పెంచేసింది.

ఇప్పుడు టాలీవుడ్‌లో బిగ్‌ క్వశ్చన్‌ – “తేజా సజ్జా నెక్స్ట్ టైయర్‌ 1 హీరో అవుతాడా?”

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘మిరాయ్’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ‘మిరాయ్’ సినిమాకు విజువల్స్, కథ, మరియు నటీనటుల నటనకు మంచి స్పందన రావడంతో, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

, , , , ,
You may also like
Latest Posts from