
సమంత ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. ఏమి మాయ చేసావే తో మొదలెట్టి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో క్రేజ్ పీక్స్‌కి చేరింది. ఇక అల్లు అర్జున్ – సమంత కాంబో అంటే ఎప్పుడూ హిట్ గ్యారంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన పాటల్లో ఇద్దరి కెమిస్ట్రీ గుర్తు చేసుకుంటే ఫ్యాన్స్ ఇప్పటికీ థ్రిల్ అవుతారు.
అయితే ఈ మధ్యకాలంలో సమంత కొత్తగా తెలుగులో ఏ సినిమాలు చేయలేదు. నటిగా కాస్త పాజ్ తీసుకుని, నిర్మాతగా ‘శుభం’ సినిమా చేసింది. అందులో ఓ పాత్ర వేసింది. అయితే అది చెప్పుకోదగినదిగా మిగలలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఆమె రీ-ఎంట్రీపై పెద్ద హంగామా మొదలైంది.
టాక్ ఏంటంటే – అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో సమంతకి ఓ సెన్సేషనల్ రోల్ ఆఫర్ అయిందట. కథలో కీలకమైన ట్విస్ట్ ఇచ్చే ఆ పాత్రకి సమంతే పర్ఫెక్ట్ అని భావించి, మేకర్స్ ఆమెను సంప్రదించారని వార్త.
ఇంకా షాకింగ్ పాయింట్ ఏంటంటే – ఆ స్పెషల్ రోల్ కోసం సమంతకి దాదాపు రూ.3 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట. సమంత కూడా ఈ ఆఫర్‌కి సుముఖంగానే ఉన్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్!
గుర్తుందా? ‘పుష్ప’లో ఊ అంటావా మామా ఐటమ్ సాంగ్‌తో సమంత సెన్సేషన్ సృష్టించింది. ఒక్క పాటతోనే నేషన్ వైడ్ క్రేజ్ చూపించింది. అటువంటి సమంత ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కీలక రోల్ చేస్తే… ఆ ప్రాజెక్ట్‌కి మరింత బలమైన బూస్ట్ కచ్చితమే.
అయితే, ఇది ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం “సమంత – బన్నీ – అట్లీ కాంబో”పై హీట్ పెరిగిపోతోంది.
