
చెన్నై చంద్రం త్రిష ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్‌లో బిజీగా ఉంది. వరుస సినిమాలతో మళ్లీ ఫుల్ డిమాండ్‌లో ఉన్న ఈ సీనియర్ హీరోయిన్, భారీ పారితోషికం తీసుకుంటున్నా — నిర్మాతలు సంతోషంగా చెల్లిస్తున్నారు. కెరీర్ లో బిజీగా ఉన్న ఆమె పెళ్లి రూమర్స్ విషయంలోనూ ఎప్పుడూ బిజిగా ఉంటుంది.
ఇక తాజాగా ఆమెపై మరోసారి ‘వెడ్డింగ్ రూమర్’ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక నేషనల్ పోర్టల్ ప్రకారం, త్రిష త్వరలోనే చండీగఢ్‌కు చెందిన ఓ బిజినెస్‌మన్‌ను వివాహం చేసుకోబోతుందట! ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పేశాయట అని ఆ న్యూస్ వైరల్ అయ్యింది.
ఈ వార్తలతో నెట్టింట హడావుడి పెరిగిపోగా, త్రిష మాత్రం తన సిగ్నేచర్ హ్యూమర్ స్టైల్లో స్పందించింది. సోషల్ మీడియాలో సటైరిక్ పోస్ట్ వేసి —
“నా జీవితాన్ని ప్లాన్ చేసే వాళ్లంటే నాకు ఇష్టం… హనీమూన్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేయండి ప్లీజ్!”
అని త్రిష రాసింది.
2015లో ఎంట్రప్రెన్యూర్ వరుణ్ మనియన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగినా, పెళ్లి దాకా వెళ్లలేదు. అప్పటినుంచి త్రిష సింగిల్‌గానే ఉన్నారు.
ఇప్పుడు ఆమె హాస్యప్రధాన స్పందనతో నెట్‌లో #Trisha ట్రెండ్ అవుతోంది — “హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు?” అంటూ అభిమానులు కూడా కామెంట్లలో ఫన్ చేస్తున్నారు!
