లాస్ట్ ఇయర్ హనుమాన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో తేజ సజ్జా, ఈ ఇయర్ కూడా మిరాయ్తో అదే ఫామ్ కొనసాగించాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్–అడ్వెంచర్ సినిమా.. థియేట్రికల్ రన్ ముగిసేలోపే ₹150 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ఓటిటిలోకి అడుగుపెట్టబోతోంది. డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ దక్కించుకోగా, అక్టోబర్ 10 నుంచి సౌత్ లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల థియేట్రికల్ విండో తర్వాత నవంబర్‌లో స్ట్రీమింగ్ కానుంది.

సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో రిలీజ్ అయిన మిరాయ్, అద్భుతమైన విజువల్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను అలరించింది.

కథలోకి వెళ్తే –

తొమ్మిది గ్రంథాలు చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. వాటిని కాపాడే అతీంద్రియ శక్తులు, వాటిని చేజిక్కించుకోవాలని ప్రయత్నించే మనోజ్ (మంచు మనోజ్), ఆ ముప్పును ఎదుర్కోవడానికి వీరుడిగా ఎదిగే వేద (తేజ సజ్జా) మధ్య సాగే యుద్ధమే అసలు కథ. తొమ్మిదో గ్రంథం పవిత్రమైనది, దాన్ని రక్షించే శ్రీయ సరన్ పాత్ర ఈ కథకు హృదయంగా నిలుస్తుంది.

కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు మనోజ్, శ్రీయా సరన్, రీతిక నయర్, జగపతిబాబు, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ – గౌర హరిష్.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – థియేటర్స్‌లో వసూళ్ల వర్షం కురిపించిన మిరాయ్.. ఓటిటిలో కూడా అదే రికార్డ్స్ బద్దలు కొడుతుందా?

, , , , ,
You may also like
Latest Posts from