మెగా వార‌సుడు అకీరా నందన్ లాంచింగ్ గురించి గత రెండేళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గానే ఉందనే సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయినా చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తూ, స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అమ్మతో పాటు ఎక్కువగా ఉన్నా, ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ దగ్గరే ఎక్కువగా గడుపుతున్నాడట.

సినిమా ఈవెంట్లలో హాజరై, స్టార్ డైరెక్టర్లతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గిటార్ పక్కన పెట్టేసినట్లే కనిపిస్తున్న అకీరా, ఇప్పుడు పక్కా హీరో కటౌట్ వైపు అడుగులు వేస్తున్నాడని టాక్.

“సుజిత్ మీద పీకే నమ్మకం – అదే అకీరా లాంచ్ కీ?”

ఓజీ సినిమా ఎంత ఇష్టపడి చేసారో పవన్ మాటల్లోనే బయటపడింది. అంతే కాకుండా, సుజిత్ లాంటి డైరెక్టర్ ఉంటే రాజకీయాల్లోకే రాకపోవచ్చని పీకే చెప్పిన విషయమే ఆయనకు ఎంత బలమైన ఇంప్రెషన్ కలిగిందో అద్దం పట్టింది. ఇప్పుడు అదే కారణంగా, అకీరా లాంచింగ్ బాధ్యతలను సుజిత్‌కే అప్పగిస్తారా? అన్న చర్చ మెగా ఫ్యామిలీలోనూ మొదలైందట.

“OG -2 లోనే అకీరా హీరోనా?”

పవన్ కళ్యాణ్ OG -2 లో చేయాలా వద్దా అన్నది ఇంకా క్లారిటీ లేకపోవడంతో, ఒకవేళ ఆయనకు టైమ్ లేకపోతే అకీరా నందన్ లీడ్ రోల్‌లో ఎంట్రీ ఇవ్వడం కూడా సాధ్యమేనని బలమైన టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఇది సీక్వెల్ కావడంతో హీరో మారినా పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా పీకే తనయుడే కాబట్టి ఫ్యాన్స్‌కి కూడా ఎలాంటి సమస్య ఉండదు. అందుకే, OG -2 లో అకీరా ఎంట్రీతోనే అసలైన థ్రిల్ మొదలవుతుందా? అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

మరి నిజంగానే అకీరా నందన్ OG -2 లో హీరోగా ఎంట్రీ ఇస్తాడా? లేక మరో ప్రత్యేక ప్రణాళిక ఉందా? అన్నది రాబోయే రోజుల్లోనే తేలనుంది.

, , , , ,
You may also like
Latest Posts from