
రష్మిక మందన్నా ఇప్పుడు హాట్‌టాపిక్! ‘థామా’ మూవీ నుంచి విడుదలైన ‘Poison Baby’ సాంగ్‌తో సోషల్ మీడియా వేడెక్కిపోయింది. మలైకా అరోరా గ్లామ్ డ్యాన్స్‌కు స్టేజ్ సిద్ధం కాగా, ఎంట్రీ ఇచ్చింది రష్మికే — కానీ ఈసారి రొమాంటిక్ హీరోయిన్‌గా కాదు, వాంపైర్ గ్లామ్ క్వీన్గా!
సాంగ్ మొదలవగానే మలైకా క్లబ్ సెటింగ్‌లో స్టేజ్‌ను ఆక్రమిస్తే, ఆ మధ్యలో అడుగుపెడుతుంది ఆయుష్మాన్ ఖురానా–రష్మిక జంట. రష్మిక చేతిలో రెడ్ వైన్ గ్లాస్‌కి ఆకర్షితమై, దానిని రక్తమని భావించి ఒక్కసారిగా తాగేసే సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తర్వాత మలైకాతో కలసి ఆమె ఇచ్చిన స్టెప్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
‘థామా’ డైరెక్టర్ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హారర్–రొమాన్స్ మిశ్రమం. రష్మిక పాత్రలో ఉన్న అతీంద్రియ మిస్టరీపై ఫ్యాన్స్‌లో ఉత్సుకత పెరుగుతోంది.
