
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన “బాఘీ 4” థియేటర్లలో పెద్దగా రాణించకపోయినా, ఇప్పుడు ఓటిటి బాట పట్టబోతోంది. ఎ. హర్షా దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సోనం బాజ్వా, మాజీ మిస్ యూనివర్స్ హర్ణాజ్ సందూ, సీనియర్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, బాఘీ 4 డిజిటల్ రైట్స్‌ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 17, 2025న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ నడుస్తోంది. అయితే ఇది రెంటల్ బేసిస్ పై ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సాజిద్ నాడియాడ్‌వాలా తన నాడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. హై ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, భావోద్వేగాలకు కూడా చోటిచ్చే కథతో ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో పూర్తిగా ఆకట్టుకోలేకపోయినా, ఓటిటిలో మాత్రం మంచి రిజల్ట్ రాబడుతుందేమో చూడాలి.
సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సంజయ్ దత్ విలన్‌గా, టైగర్ ష్రాఫ్ తన స్టంట్స్‌తో మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నాడు. అయితే ప్రైమ్ అధికారిక కన్‌ఫర్మేషన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు!
