సినిమా వార్తలు

‘బాహుబలి’ రీ-రిలీజ్‌కి ప్రశాంత్ నీల్ షాకింగ్ రివ్యూ! జక్కన్నకు ఇచ్చిన రేర్ ట్రిబ్యూట్!

తెలుగు సినీ చరిత్రను రెండు భాగాలుగా విభజించిన సినిమా – ‘బాహుబలి’. పదేళ్ల క్రితం ప్రేక్షకుల గుండెల్లో తుఫాన్ లేపిన ఈ మాస్టర్‌పీస్… ఇప్పుడు మళ్లీ ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదే సమయంలో ఈ రీ-రిలీజ్ పై పాన్-ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి సాలిడ్ రివ్యూ ఇచ్చారు!

అదీ గానీ డైరెక్ట్‌గా కాదు… ఓ కథ రూపంలో! ఆయన భార్య లిఖిత ఈ స్పెషల్ రివ్యూను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో నెట్టింట చర్చే చర్చ!

నీల్ చెప్పిన స్టోరీ – జక్కన్నకు డైమండ్ సాల్యూట్!

“ఒక రోడ్‌ని రిపేర్ చేయమన్నారు… ఆ కాంట్రాక్టర్? రిపేర్ మాత్రమే కాదు, 16-లైన్ల హైవేలా మార్చేశాడు! ఆ రోడ్డు – ఇండియన్ సినిమా.
ఆ కాంట్రాక్టర్ – రాజమౌళి!”

అంతే కాదు… ఒక తరం కలలు కనింది, వాళ్లకు రూపం ఇచ్చింది ఈ టీమ్ అంటూ నీల్ బాహుబలి యూనిట్ మొత్తానికి థ్యాంక్స్ కూడా చెప్పేశారు.

రీరిలీజ్ స్పెషల్స్ – THIS Time It’s Tight!

రెండు పార్ట్స్‌ని ఒకేసారి, 90+ నిమిషాలు తగ్గించి ‘ద ఎపిక్’గా మళ్లీ తెరపైకి జక్కన్న తెచ్చేసారు.

కట్ అయినవి?

అవంతిక లవ్ ట్రాక్

పచ్చబొట్టేసిన పాట

ఇరుక్కుపో సాంగ్

కన్నా నిదురించరా

యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్స్

అయినా కథలో ఏ డ్రాప్ లేదు… ఏ బీట్ మిస్ అవలేదు అంటున్నారు ఫ్యాన్స్! ఇంకా తమాషా ఏమిటంటే, ఏడు సార్లు చూసిన వాళ్లు కూడా ఇపుడు థియేటర్లలో గూస్‌బంప్స్‌తో బయలుదేరుతున్నారు!

ఈ వీకెండ్ బుకింగ్స్ ఫుల్! ఇంకా షో చూసి రావాలి అంటే ముందే ప్లాన్ చేసుకోండి… లేకపోతే మళ్లీ క్యూలో నిలబడాల్సిందే!

జై మాహిష్మతీ!

Similar Posts