చిరంజీవి హీరోగా… యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambara). త్రిష (Trisha), ఆషికా రంగనాథ్ కథానాయికలు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కునాల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమానుంచి ఓ విషయం లీక్ అయ్యింది. అదేమిటంటే…
ఈ సినిమాలో ఓ ఫైట్ ఉందట. దాన్ని వశిష్ట చాలా ఇంట్రస్టింగ్ గా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. ఆరుగురు రాక్షసులతో చిరంజీవి తలపడే ఓ ఫైట్ సీన్ .. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని సమాచారం.
ఆ ఫైట్ చాలా కీలకమైన దశలో వస్తుందని, అందులో కనిపించే విజువల్స్ అబ్బుర పరుస్తాయన్నది ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మూడు లోకాలు ఉంటాయని, ప్రతీ లోకంలోనూ కొత్త తరహా మనుషులు, జంతువులు కనిపించబోతున్నాయి. అవన్నీ పిల్లలకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని చెప్తున్నారు.
మరో ప్రక్క ఈ కథలో హనుమాన్ కు కూడా ప్రాధాన్యత ఉందని, హీరోని హనుమంతుడు కాపాడుతుంటాడని తెలుస్తోంది. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజున చిరంజీవి ఇంద్ర విడుదలై బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టింది. ఆ సెంటిమెంట్ తోనే ఆ డేట్ ఫిక్స్ చేశారని సమాచారం.