
రష్మిక సునామీ! ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రిలీజ్‌కి ముందే ₹21 కోట్ల డీల్ – వెనక అసలు కథ ఏంటి?
పాన్–ఇండియా స్టార్ రష్మిక మందన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మళ్లీ రుజువైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా థియేటర్లకు రాకముందే భారీ హడావుడి క్రియేట్ చేస్తోంది!
ఇప్పుడు ఫిల్మ్ మార్కెట్ కష్టంగా ఉన్నప్పటికీ…
ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో ఏకంగా ₹21 కోట్లు దక్కించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
నెట్‌ఫ్లిక్స్ బ్లాక్ బస్టర్ ఆఫర్ – ₹14 కోట్లు!
ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం,
Netflix OTT రైట్స్: ₹14 కోట్లు
డబ్బింగ్ + శాటిలైట్ రైట్స్: ₹7 కోట్లు
మొత్తం: ₹21 కోట్లు!
బిగ్ హీరో సినిమాలు కూడా రేట్లు పడిపోతున్న టైమ్‌లో…
ఒక్క రష్మిక స్టార్డం మీదే ఈ మోతాదు డీల్‌లు క్లోజ్ అవ్వడం అంటే?
ఎంత హైప్ ఉందో ఊహించుకోండి!
మోడ్రన్ లవ్‌లో డార్క్ షేడ్ – ట్రైలర్ ఎమోషన్స్ పీక్
ట్రైలర్ లోనే ప్యూర్ రొమాన్స్ కాదు…పొసిషన్, హర్ట్, టాక్సిక్ లవ్ ట్రాక్ చూపించారు. ఇది ఓ సింపుల్ లవ్ స్టోరీ కాదని, మోడ్రన్ రిలేషన్‌షిప్‌లోని రియలిస్టిక్ పైన్స్, ఎమోషన్స్ మీద ఫోకస్ చేసారనే హింట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రష్మిక – దీక్షిత్ శెట్టి కెమిస్ట్రీ కూడా యూత్‌ను టార్గెట్ చేస్తోంది.
రిలీజ్ డేట్ – పాన్ ఇండియా ప్లాన్
నవంబర్ 7 – తెలుగు & హిందీ. తర్వాత సౌత్ లాంగ్వేజెస్ రిలీజ్
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రీలీజ్ కాకముందే ₹21 కోట్లు సొంతం చేసుకోవడం. రష్మిక మార్కెట్ పవర్‌ను చూపించే నిదర్శనం.
