“మాస్ కా దాస్” విశ్వక్ సేన్ ఇప్పుడు పూర్తి ఫంకీ మూడ్‌లో ఉన్నాడు! ‘లైలా’ అంచనాలను అందుకోకపోవడంతో ఈసారి ఏ రిస్క్‌కీ వెళ్లకుండా, “ఫంకీ” సినిమాతో 100% హిట్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు.

థియేట్రికల్ రిలీజ్ డేట్:

ఫంకీ సినిమా 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ డేట్‌తో సమ్మర్ బాక్సాఫీస్‌ను విశ్వక్ తన స్టైల్లో హీట్ చేయబోతున్నాడు!

దర్శకుడు – అనుదీప్ కె.వి.

‘జాతిరత్నాలు’ ద్వారా నవ్వులతో కలెక్షన్లు కొట్టిన అనుదీప్, తర్వాత శివకార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ సినిమా తర్వాత, ఇప్పుడు విశ్వక్‌తో కలసి మళ్లీ తన మార్క్ కామెడీ టైమింగ్ తో పక్కా ఎంటర్‌టైనర్ అందిస్తున్నాడు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం — ఈసారి అనుదీప్, మాస్ ఆడియెన్స్‌ని కూడా టార్గెట్ చేశాడట!

హీరోయిన్ – కయదు లోహార్

‘డ్రాగన్’ మూవీతో అందాల అలరించిన కయదు లోహార్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇంతకు ముందు శ్రీ విష్ణుతో చేసిన అల్లూరి సినిమాలో పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ డ్రాగన్ తర్వాత ఆమె గ్లామర్, పర్ఫార్మెన్స్ కలిపి ఫుల్ క్రేజ్ తెచ్చాయి. ఇప్పటికే తమిళంలో కూడా శింబు నెక్స్ట్ మూవీలో ఛాన్స్ దక్కిందని టాక్.

టీజర్ టాక్:

ఇటీవల రిలీజ్ చేసిన ఫంకీ టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. విశ్వక్ సేన్ ఈసారి “డైరెక్టర్” అవతారంలో కనిపిస్తున్నాడు –అతని స్టైల్, హాస్యం, అటిట్యూడ్ అన్నీ కలిసి పక్కా “ఫంకీ” ఎనర్జీ ఇస్తున్నాయి. కయదు లోహార్ యూత్‌ఫుల్ వైబ్‌తో స్క్రీన్‌కి న్యూ స్పార్క్ తెచ్చింది.

మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో బీట్‌లు సినిమాకి ఎగిరే ఎనర్జీని జోడిస్తున్నాయి.

బ్యానర్లు & టీమ్:

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్లు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య.
వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

మొత్తానికి –

“ఫంకీ” అంటేనే పేరు చెప్పేస్తుంది – ఇది ఒక పక్కా ఫన్ బ్లాస్ట్! విశ్వక్ సేన్ ఈసారి నవ్వులు, ఎనర్జీ, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ మిక్స్ చేసి 2026 సమ్మర్‌కి థియేటర్లలో ఫుల్ హీట్ తెచ్చేలా సిద్ధమవుతున్నాడు!

, , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com