సినిమా వార్తలు

“రాజు వెడ్స్ రాంబాయి” ఏ OTT లో ..ఎప్పుడొస్తుంది? !

డివైడ్ టాక్‌తో మొదలై… ఊహించని విధంగా తెలంగాణాలో క‌లెక్ష‌న్స్‌ను గట్టిగా లాక్ చేసుకుని సైలెంట్‌గా హిట్ కొట్టేసిన సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. పెద్ద స్టార్‌లు–పెద్ద ప్రమోషన్స్ ఏమీ లేకుండానే, మౌత్ టాక్‌తోనే ఈ సినిమా తనదైన మార్క్ క్రియేట్ చేసింది. రిలీజ్ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే ₹7.5 కోట్ల గ్రాస్ తీసుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడైతే అందరి డౌట్ ఒక్కటే—

“OTT ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫామ్?”

మరి ఇదిగో తాజా ఇంట్రస్టింగ్ అప్‌డేట్…

ఏ ప్లాట్‌ఫామ్? — ఈటీవి విన్!

సినిమా డిజిటల్ రైట్స్‌ను ETV Win దక్కించుకుంది.

ఎప్పుడు వస్తుంది? — సంక్రాంతి 2026!

ప్రొడ్యూసర్ బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చినట్టు, సాధారణంగా తెలుగు సినిమాలు 4 వారాల్లోనే ఓటీటీకి వస్తాయి. కానీ “రాజు వెడ్స్ రాంబాయి” మాత్రం థియేటర్లలో 50 రోజులు ఫుల్ రన్ కంప్లీట్ చేసిన తర్వాతే డిజిటల్‌లోకి వస్తోంది.

దాంతో…
సంక్రాంతి 2026 (జనవరి 10–16 మధ్య) ఈటీవి విన్‌లో స్ట్రీమ్ అయ్యే ఛాన్సెస్ కచ్చితంగా ఉన్నాయి.

Similar Posts