సినిమా వార్తలు

1000 రోజులు కష్టం… ఫ్యాన్స్ కి నిరాశ? ‘ఏకాకి’పై నెటిజన్ల ఫుల్ అటాక్!

ఇండియా టాప్ కామెడీ యూట్యూబర్‌లలో ఒకరైన అశీష్ చంచలాని భారీగా హైప్ క్రియేట్ చేసి రిలీజ్ చేసిన ఏకాకి – Chapter 1: Presence… ఎలా ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎంతో హైప్ తో రిలీజైన ఈ ఎపిసోడ్ కు నెట్‌లో రియాక్షన్లు మాత్రం పూర్తిగా మిక్స్‌డ్. కొన్ని కామెంట్స్ చూస్తే — “బ్రో… ఇది రెండు సంవత్సరాలు రాసుకోవాల్సిన కంటెంట్ ?” అని ఫ్యాన్స్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రియాక్షన్స్ వస్తున్నాయి.

1000 రోజులు కష్టపడి… స్పెషల్ ప్రాజెక్ట్‌గా తీసుకొచ్చిన ‘ఏకాకి’ అశీష్‌కి బలమైన కంబ్యాక్ ఇవ్వాలి. కానీ తొలి ఎపిసోడ్ ఫ్రీగా రిలీజ్ చేసినా, రిజల్ట్ మాత్రం అంతగా పాజిటివ్‌గా కనిపించడం లేదు.

ఎందుకంత నెగటివ్ రియాక్షన్?

విల్లాకు ఫన్ ట్రిప్‌కు వెళ్లిన ఫ్రెండ్స్ గ్రూప్… అకస్మాత్తుగా ఎదురయ్యే ఒక స్ట్రేంజ్ ప్రెజెన్స్ — కథ ఓకే. ప్రొడక్షన్ కూడా ఫెయిర్. కానీ— కామెడీ ఫోర్స్‌డ్‌గా అనిపించింది. పర్ఫార్మెన్సులు నేచురల్‌గా లేవని కామెంట్స్

“అశీష్ పాత స్కెచ్‌లలో ఉన్న ఎనర్జీ ఇక్కడ కనిపించలేదు” అని ఫ్యాన్స్ ఫీల్

ఇంకా పెద్ద పోలిక:

“బువన్ బామ్ Dhindora & Taaza Khabar చాలా ముందున్నాయి… ‘ఏకాకి’ రీచ్ అవ్వలేకపోయింది” అన్నది సోషల్ మీడియా కన్సెన్సస్.

Varanasi Event తరువాత మరో డిజాస్టర్?

ఇటీవల వరణాసి గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ హోస్టింగ్‌పై అశీష్‌కి భారీగా ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ‘ఏకాకి’ వచ్చాక కూడా నెటిజన్లు: “Varanasi తర్వాత స్ట్రైట్ రెండో డిజాస్టర్ ఇదే!”. అంటూ కాస్త హర్ష్‌గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక తర్వాతి చాప్టర్స్‌పై హోప్?

మొదటి ఎపిసోడ్ మిక్స్‌డ్ నుంచి నెగటివ్ వైబ్ క్రియేట్ చేసినా… సిరీస్ ఇంకా ముగియలేదు. తర్వాతి చాప్టర్స్‌లో అశీష్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ చేస్తాడా? నెగటివ్ బజ్‌ని రివర్స్ చేస్తాడా? అన్నది ఇప్పుడు Gen Z ఆడియెన్స్‌లో పెద్ద క్యూరియాసిటీ.

Similar Posts