డేవిడ్ కొరెన్స్‌వెట్‌, రెచెల్ బ్రోస్‌నహన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ మూవీ ‘సూపర్‌మ్యాన్’ (Superman) భారతదేశంలో జూలై 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇండియన్ వెర్షన్‌లో కొన్ని సన్నివేశాలు సెన్సార్‌ తొలగించడంతో, ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ నటి శ్రేయా ధన్వంతరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూపర్‌మ్యాన్‌ సినిమా నుంచి 33 సెకన్ల ముద్దు సన్నివేశాన్ని కత్తిరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఇది ఏ విధమైన నిర్ణయం? ఒకవైపు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి అంటారు, పైరసీని నివారించండి అని చెబుతారు. కానీ ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూస్తూ, సినిమాల్లో ఏమి చూడాలో చెప్పే హక్కు సెన్సార్‌ బోర్డుకు ఎవరు ఇచ్చారు? మేము మా డబ్బు ఖర్చు పెట్టి, సమయం వెచ్చించి సినిమా చూస్తున్నాం.. దాన్ని పూర్తిగా ఆస్వాదించే స్వేచ్ఛ మాకు ఉండకూడదా?’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ప్రశ్నించారు.

‘‘సినిమా అనుభవం థియేటర్లోనే పూర్తి అవుతుంది. అలాంటప్పుడు ఇలాంటి కత్తిరింపులు, మార్పులు చేసేందేమిటి? ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇలాంటి చర్యలు ప్రేక్షకుల ఉత్సాహాన్ని తగ్గించుతాయి. థియేటర్ అనుభూతిని దెబ్బతీస్తాయి’’ అని ఆమె గట్టిగా వ్యాఖ్యానించారు.

ఇక సెన్సార్‌ బోర్డు ఆక్షేపణలతో హీరో డైలాగ్‌లు, కొన్ని పదాలు కూడా మార్పులకు గురయ్యాయి. మార్పుల అనంతరం ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్‌ పొందింది. 2 గంటల 10 నిమిషాల నిడివితో ఇది ఇండియన్ థియేటర్లలో విడుదలైంది.

శ్రేయా ధన్వంతరి ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘చుప్’, ‘స్కామ్‌ 1992’ వంటి ప్రాజెక్టులతో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘జోష్’, ‘స్నేహ గీతం’ వంటి చిత్రాల్లోనూ నటించారు. త్వరలో రాబోతున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from