
“జైలర్ 2” రిలీజ్ డేట్ లీక్ ? రజినీ ర్యాంపేజ్ ఎప్పుడంటే…
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటేనే ఓ బ్రాండ్. ఆయన సినిమా అనగానే సౌత్ అంతా కదిలిపోతుంది. ఇప్పుడు ఆ లెవెల్ హైప్‌తో వస్తోంది “జైలర్ 2”. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మళ్లీ రజినీతో కాంబినేషన్ రిపీట్ చేస్తుండటమే కాక, మొదటి భాగం వందల కోట్ల వసూళ్లు సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
షూటింగ్ పూర్తి.. రిలీజ్ బజ్ మొదలైంది!
ఇప్పటికే “జైలర్ 2” షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ లాంటి స్టార్‌లు మరోసారి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సారి కథ ఇంకా స్టైలిష్‌గా, రజినీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో నిండుగా ఉంటుందని టాక్. అయితే రిలీజ్ ఎప్పుడు
అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏమిటంటే —
“జైలర్ 2” జూన్ 12, 2026న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోందట!
ఇక ఈ తేదీని మేకర్స్ లాక్ చేసినట్టు టాక్ ఉన్నప్పటికీ, అధికారిక అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అధికారిక క్లారిటీ కోసం ఫ్యాన్స్ కౌంట్‌డౌన్!
