ఇవి ఓటిటి రోజులు. ఓటిటి డీల్ ఓకే అయితేనే పెద్ద సినిమాలు రిలీజ్ చేయగలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటిటిలదే పై చేయి అవుతోంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు కూడా అది తప్పేటట్లు కనపడటం లేదు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ రిలీజ్‌పై క్లారిటీ లేకపోవడంతో అమేజాన్ ప్రైమ్ అలర్ట్..! డీల్ నుండి వెనక్కి తగ్గే పరిస్థితి?కనపడుతోంది.
పవన్ కళ్యాణ్‌కి ఇది లాంగ్ పెండింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ… ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు డ్రామా అంతా అమెజాన్ ప్రైమ్ చుట్టూ తిరుగుతోంది!
మార్చి 28న థియేటర్లలోకి వస్తుందని అభిమానులు ఊహించిన హరి హర వీర మల్లు విడుదల ముందుగా మే 9కి మారింది. కానీ తాజా సమాచారం ప్రకారం… మే 9న కూడా సినిమా విడుదల కావడం చాలా డౌటుగా కనిపిస్తోంది.
ఇక ఇప్పటికే అన్ని భాషల డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అది కూడా ఫ్యాన్సీ రేటుకి, పవన్ మార్కెట్‌ను బట్టి చాలా కాలం క్రితమే డీల్ క్లోజ్ అయింది. కానీ… సినిమాపై స్పష్టత లేకపోవడంతో అమేజాన్ ప్రైమ్ నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
విడుదల మే 9లోపు జరగకపోతే:
అమెజాన్ డీల్‌ను 50% వరకు తగ్గించబోతోంది
లేదా ఎగ్రిమెంట్ కాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది
అంటే ఓవర్ ఆల్‌గా నిర్మాతలకు ఇది పెద్ద షాక్ కావచ్చు. డిజిటల్ రివెన్యూ లాభాలపై ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించనుంది.
పవన్ కళ్యాణ్ షెడ్యూల్ పై క్లారిటీ లేదు
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఈ సినిమా కోసం నాలుగు రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇటీవల ఆయన 8 కిలోల బరువు తగ్గి సిద్ధమవుతున్నప్పటికీ, తన కొడుకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. ఆయన తిరిగి వచ్చాకే సెట్స్‌లో అడుగుపెడతారని సమాచారం.