సినిమా వార్తలు

‘అఖండ 2’ విలన్ రోల్‌ని రిజక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

బాలకృష్ణ సినిమా రిలీజ్ అనగానే థియేటర్లలో పండగ వాతావరణం. అంచనాలకు తగ్గట్టుగానే ‘అఖండ 2: తాండవం’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలయ్య రుద్ర తాండవానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటే… ఈ సినిమాతో సంబంధం ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఇప్పుడు బయటకు వచ్చింది!

ఈ సినిమాలో ఆది పినిశెట్టి చేసిన విలన్ రోల్‌ను ముందుగా ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడట! అసలు ఆ హీరో ఎవరు? ఎందుకు వదిలేశాడు?

అడ్డంకులన్నీ దాటుకుని… బాలయ్య తాండవం మొదలైంది!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. బోయపాటి శ్రీను సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్ ఈసారి కూడా పుష్కలంగా ఉన్నాయి.

భారీ క్యాస్ట్… కానీ విలన్ రోల్ వెనుక అసలు కథ ఇదే!

ఈ సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటించగా, హర్షాలీ మల్హోత్రా, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, సాయి కుమార్, పూర్ణ, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.కానీ అందరిలోనూ ఎక్కువగా చర్చకు వచ్చిన పాత్ర— తాంత్రికుడిగా ఆది పినిశెట్టి చేసిన నెగెటివ్ రోల్. అతని లుక్, ఆహార్యం ప్రేక్షకులకు నిజంగానే భయాన్ని కలిగించాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే— ఈ రోల్‌కు ఆది పినిశెట్టి ఫస్ట్ ఛాయిస్ కాదట! బోయపాటి శ్రీను ముందుగా ఈ పాత్ర కోసం మంచు మనోజ్‌ను సంప్రదించారట. స్వయంగా కథ కూడా వినిపించారట. కానీ అప్పటికే మనోజ్ చేతిలో ఇతర సినిమాలు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయాడట. ఆ తర్వాత మరికొందరు స్టార్ హీరోల దగ్గరకు కూడా ఈ రోల్ వెళ్లిందట. కానీ ఎవ్వరూ ఆసక్తి చూపలేదట!

చివరికి ఆది పినిశెట్టి ఓకే… రోల్ ఫైనల్!

అలా చివరికి ఈ క్యారెక్టర్ ఆది పినిశెట్టి దగ్గరకు వెళ్లిందట. ఫ్రెండ్స్ సజెషన్‌తో కథ విన్న ఆది— వెంటనే ఓకే చెప్పేశాడట. ఇదివరకే బోయపాటి–ఆది కాంబినేషన్ ‘సరైనోడు’ సినిమాలో అదిరిపోయే విలన్ పాత్రతో హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ సినిమాలో తాంత్రికుడిగా ఆడియెన్స్‌ను భయపెట్టాడు ఈ ట్యాలెంటెడ్ యాక్టర్.

ఒక స్టార్ హీరో వదిలేసిన రోల్… చివరకు ఆది పినిశెట్టికి కలిసొచ్చింది! ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్‌తోనే ‘అఖండ 2’ థియేటర్లలో మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Similar Posts