
ఫ్యాన్స్ కోసం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లేటెస్ట్ అప్డేట్
2025ని బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ తన స్టైల్లో ముగించాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ తో సంవత్సరంలోనే టాప్ గ్రాసర్‌గా నిలిచి, మాస్ పల్స్‌ని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు. ఆ ఊపు తగ్గకముందే… అభిమానుల్లో మరోసారి అగ్ని రాజేసింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్లేంగే సాలా’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, మ్యూజిక్ చార్ట్స్‌ని షేక్ చేస్తోంది. ఈ హైప్ మధ్యలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా షూటింగ్‌ని ఫుల్ స్పీడ్‌లో ముగించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ దశలోకి వెళ్లింది.
ఈ షెడ్యూల్లో మిగిలిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాశీ ఖన్నా ఇప్పటికే తన పార్ట్ పూర్తి చేయగా, పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే షూటింగ్ ముగించారు. ఇప్పుడు టీమ్ మొత్తం ఫైనల్ టచ్ ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడబోతున్నాం అన్నదే ఫ్యాన్స్‌కి అదిరిపోయే హుక్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, ఒక్క పాటతోనే వచ్చిన బజ్… రాబోయే రోజుల్లో మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో క్లియర్‌గా చూపిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని – రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అన్నీ కలిసొస్తే… ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో మాస్ పండగ ఎలా ఉండబోతుందో ఊహించుకోవడమే మిగిలింది.
