సినిమా గాసిప్స్సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత నాగవంశీకి ఆ హీరోయిన్ అంటే క్రష్… అందుకే దుబాయ్ ట్రిప్స్?

టాలీవుడ్‌లో నిర్మాతలు–హీరోయిన్ల మధ్య సంబంధాలపై ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కొన్నిటికి ఆధారాలు ఉండవు… మరికొన్నిటిని సంబంధిత వ్యక్తులే ఖండిస్తుంటారు. కానీ చాలా అరుదుగా, ఓ ప్రముఖ నిర్మాత స్వయంగా తన మనసులో ఉన్న ఇష్టాన్ని, క్రష్‌ను ఓపెన్‌గా చెప్పిన సందర్భాలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ, ప్రభావవంతమైన నిర్మాతలలో ఒకరైన నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్) కూడా అలాంటి అరుదైన నిజాయితీతో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు దారి తీశాయి. హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నాడన్న రూమర్స్‌ను సూటిగా ఖండించిన నాగవంశీ… అదే సమయంలో తనకు ఏ హీరోయిన్ అంటే క్రష్ ఉందో కూడా దాచకుండా చెప్పేశారు.

అంతే కాదు… తరచూ దుబాయ్‌కు ఎందుకు వెళ్తుంటారు? ఒత్తిడిని ఎలా తగ్గించుకుంటారు? ఫిజిక్ మైంటైన్ చేయడం వెనక కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు కూడా నాగవంశీ ఇచ్చిన సమాధానాలు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి.

సినిమాల పరంగా లాభ–నష్టాల్ని చూసుకుంటూనే, వ్యక్తిగత జీవితంలో సింపుల్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండే నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత… ఈసారి మాత్రం తన క్రష్, తన అలవాట్ల గురించి మాట్లాడి ఫుల్ ఫోకస్‌లోకి వచ్చారు. అయితే నాగవంశీ మనసు దోచుకున్న ఆ హీరోయిన్ ఎవరు? దుబాయ్ ట్రిప్స్ వెనక నిజమైన కారణం ఏంటి?

ఇటీవల నాగవంశీ గురించి ఇండస్ట్రీలో పలు రకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఎక్కువగా వినిపించింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నాగవంశీ… “ఇవన్నీ పూర్తిగా అవాస్తవం” అంటూ సూటిగా ఖండించారు.

అయితే అదే సమయంలో…
“ఏ హీరోయిన్ అంటే మీకు ఇష్టం?” అనే ప్రశ్నకు మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చారు.

పూజా అంటే ఇష్టం… కానీ క్రష్ మాత్రం మృణాల్!

టాలీవుడ్‌లో చాలా మంది నిర్మాతలు ఇలాంటి ప్రశ్నలకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే… నాగవంశీ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని బయటపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తరచూ దుబాయ్ ఎందుకు? అసలు నిజం ఇదే!

నాగవంశీ గురించి మరో హాట్ రూమర్… “తరచూ దుబాయ్‌కు వెళ్తుంటారు… దాని వెనక ఏదో కారణం ఉంది” అన్న ప్రచారం. దీనిపై కూడా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. “నేను దుబాయ్ వెళ్లడం నిజమే. కానీ చాలా మంది ఊహించుకునేలా కాదు. నేను దుబాయ్‌కు వెళ్లేది కేవలం షాపింగ్ కోసమే” అని స్పష్టం చేశారు. తనకు మందు, సిగరెట్ అలవాట్లు లేవని… ఒత్తిడి తగ్గించుకోవడానికి తాను చేసే ఒక్కటే పని షాపింగ్ అని చెప్పారు. “అందుకే రిలాక్స్ కావాలంటే దుబాయ్ వెళ్తుంటాను” అని నాగవంశీ తెలిపారు.

నాగవంశీ ఇటీవల ఫిజిక్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఫిట్‌గా ఉండేందుకు పికిల్‌బాల్ ఆడుతున్నానని తెలిపారు. “హీరోలతో, హీరోయిన్లతో, డైరెక్టర్లతో చర్చలకు కూర్చున్నప్పుడు… నేను కూడా బాగా కనిపించాలి కదా! అందుకే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాను” అంటూ నవ్వుతూ చెప్పడం గమనార్హం.

ఈ ఏడాది స్పీడుకు బ్రేకులు… నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా దెబ్బ

కెరీర్ పరంగా ఈ ఏడాది నాగవంశీకి అంత సాఫీగా సాగలేదు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. ఈ ఏడాది ఆయన నిర్మించిన ‘కింగ్డమ్’, ‘మాస్ జాతర’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్‌గా కొనుగోలు చేసిన ‘వార్ 2’ సినిమా భారీ నష్టాలు మిగిల్చిందని నాగవంశీ స్వయంగా అంగీకరించారు. ‘డాకు మహారాజ్’ హిట్ అయినప్పటికీ… ఓవర్ బడ్జెట్ అయిందన్న కామెంట్స్ వినిపించాయి.

2026లో భారీ ప్లాన్… ఏకంగా 10 సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని నాగవంశీ చెప్పారు. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. 2026లో నాగవంశీ నుంచి ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ముందుగా సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వచ్చే సినిమాల విషయంలో ఇకపై మరింత ప్లానింగ్‌తో ముందుకెళ్తానని నాగవంశీ స్పష్టం చేశారు.

Similar Posts