తెలుగు సినీ పరిశ్రమలో తరచూ వివాదాల్లో నిలిచే నటి కల్పిక మళ్లీ ఓ హంగామాతో వార్తల కేంద్రంగా మారింది. ఈసారి వేదికగా నిలిచినది — నగర శివారులో ఉన్న కనకమామిడి ప్రాంతంలోని బ్రౌన్‌టైన్ రిసార్ట్.

సోమవారం మధ్యాహ్నం రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, ఓ గదిలో విశ్రాంతి తీసుకుని భోజనం పూర్తిచేసింది. కానీ సాయంత్రం సమయంలో క్షణంలోనే వాతావరణం మారిపోయింది. గదికి సిగరెట్లు కావాలని అడిగిన ఆమెకు, సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించడంతో కల్పిక కోపంలో ఊగిపోయింది.

ఒకే ఊపులో నేరుగా రిసెప్షన్‌కు వెళ్లిన ఆమె, మేనేజర్ కృష్ణపై ఘాటు మాటలతో విరుచుకుపడింది. “వైఫై లేదు, సౌకర్యాలు గాలికొదిలేసారు, కనీసం సిగరెట్లు కూడా అందించలేరు?” అంటూ అగ్రహంగా గట్టిగా బదులు కోరింది. అనంతరం గదిలోని తాళాలను విసిరేసి, “ఇక్కడ నన్ను ఉంచొద్దు!” అంటూ దాదాపు గంటపాటు గొడవ చేసి, చివరికి అక్కడి నుంచి బైటికివెళ్లిపోయింది.

ఇంతటితో వ్యవహారం ముగిసిందనుకుంటే తప్పు. మంగళవారం కల్పిక స్వయంగా ఓ వీడియోను విడుదల చేస్తూ – రిసార్ట్ సిబ్బంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారనీ, దారుణంగా అవమానించారనీ ఆరోపించింది. అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు తమ వద్దకి రాలేదని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇక సోషల్ మీడియా వేదికగా కల్పిక చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్న నేపథ్యంలో – నిజం ఏంటన్నదానిపై అందరూ చర్చించటం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. మరి ఈ రిసార్ట్ ఎపిసోడ్‌కి ముగింపు ఎక్కడ పడుతుందో చూడాలి.

You may also like
Latest Posts from