సినిమా వార్తలు

సిద్ధూ జొన్నలగడ్డ ఈ సారి పెద్ద స్కెచ్చే, వర్కవుట్ అయ్యితే మామూలుగా ఉండదు

టాలీవుడ్‌లో ఒకప్పుడు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోకి ఒక్క ఏడాది రెండు షాకులు తగిలితే ఎలా ఉంటుంది? అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు సిద్దూ జొన్నలగడ్డ. 2025 చివర్లో ఆయన కెరీర్ ఊపును తగ్గించిన సినిమాలు ‘జాక్’, ‘తెలుసు కదా’. ఈ రెండు చిత్రాలు అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేయడంతో, ‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీతో వచ్చిన మోమెంటమ్‌కు గట్టి బ్రేక్ పడింది.

వరుస పరాజయాలు ఎవరినైనా డౌన్ చేయొచ్చు. కానీ సిద్ధూ అలా ఆగిపోవడం లేదు. కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టాలనే పట్టుదలతో, ఇప్పుడే నెక్స్ట్ మూవ్ ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. తాజా సమాచారం ప్రకారం, తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ ఆసక్తి పెంచాడు.

ఈసారి సిద్ధూ జతకట్టబోతున్న దర్శకుడు ఎవరో కాదు… ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో తనదైన ముద్ర వేసిన స్వరూప్ ఆర్.ఎస్ జే. స్వరూప్ సిద్ధూకు ఒక డిఫరెంట్ యాక్షన్–కామెడీ కథ వినిపించారట. స్క్రిప్ట్ విన్న వెంటనే సిద్ధూ ఇంప్రెస్ అయ్యి, ఎలాంటి ఆలస్యం లేకుండా ఓకే చెప్పాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేది ‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీకి బలమైన సపోర్ట్ ఇచ్చిన సితార ఎంటర్ట్నైమెంట్స్. నిర్మాతగా నాగవంశీ ఈ సినిమాను బ్యాంక్రోల్ చేయనున్నారు. అంటే, సిద్ధూకు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన బ్యానర్‌తోనే మరోసారి రిస్క్ తీసుకుంటున్నాడన్న మాట.

ఈ సినిమా 2026లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం. మొత్తానికి, ఫ్లాపుల తర్వాత సిద్ధూ తీసుకున్న ఈ నిర్ణయం స్మార్ట్ కంబ్యాక్ అవుతుందా? లేక మరో పరీక్షగా మారుతుందా? అన్న క్యూరియాసిటీ ఇప్పుడు టాలీవుడ్ అంతటా చర్చకు దారి తీస్తోంది. ‘డీజే టిల్లు’ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అన్నదే ఇప్పుడు అందరి దృష్టి.

Similar Posts