నాగ చైతన్య తాజా చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రటీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా జరిగింది. ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను పెంచారు. తెలంగాణలో ఎటువంటి పెంపుదల లేకుండా టీమ్ ముందుకు వెళుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం మల్టీప్లెక్స్‌లలో 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లకు 175 రూపాయల సాధారణ ధరలను కలిగి ఉంటుంది. బుకింగ్‌లు ఇప్పటికే ఇక్కడ తెరిచారు.
ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్‌లు 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌ల కోసం 50 రూపాయల టికెట్ పెంపు ఇచ్చింది ఇక్కడ గవర్నమెంట్. ఏపీలో టికెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వం నుంచి జి.ఓ ఇచ్చింది.. ఏపీలో బుకింగ్స్ తెరిచారు.
ఏపీలో టిక్కెట్ రేట్ల పెంపు విమర్శల పాలవుతోంది. ఫెస్టివల్ సీజన్ కాదు. అలాగే మీడియం బడ్జెట్ సినిమాకు ఎందుకు రేట్లు పెంచటం, ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓపినింగ్స్ పై పడుతుందని అంటున్నారు.
మరో ప్రక్కన ఇది ఎగ్జామ్స్ సీజన్ కావటం కూడా ఇబ్బంది కరంగా మారే అవకాసం ఉందంటోంది ట్రేడ్.
ఈ చిత్రం U/A సర్టిఫికేట్‌తో సెన్సార్ సర్టిఫికెట్ ను దక్కించుకుంది. 151.23 నిమిషాల రన్‌టైమ్ కలిగి ఉంది.
బ్రేక్‌ఈవెన్‌కి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.