
అల్లు అర్జున్ కొత్త సినిమా ఎనౌన్సమెంట్! ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లోడింగ్?
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఇద్దరు పేర్లు వింటే బాక్సాఫీస్ దగ్గర వణుకు పుడుతుంది.. ఒకరు రూల్ చేయడానికి పుట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరొకరు తన స్క్రీన్ ప్లేతో మాయ చేసే లోకేష్ కనగరాజ్. ఈ ఇద్దరు మాస్ మొనగాళ్లు చేతులు కలిపితే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఈ ‘క్రేజీ కాంబో’పై భోగి పండుగ సాక్షిగా అధికారిక ముద్ర పడింది!
అఫీషియల్ అనౌన్స్మెంట్:
అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా (AA23) ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. పుష్ప సినిమాతో టాలీవుడ్ రేంజ్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అనిరుధ్ మ్యూజిక్ – లోకేష్ మార్క్ యాక్షన్:
లోకేష్ కనగరాజ్ సినిమా అంటేనే యాక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది. దానికి తోడు అనిరుధ్ రవిచందర్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను దడదడలాడించడం ఖాయం. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా పనుల్లో ఉండగా.. అది పూర్తయిన వెంటనే, అంటే 2026 రెండో అర్ధభాగంలో ఈ ‘లోకేష్-బన్నీ’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.. ఇది LCU నా?
ఈ ప్రకటన రాగానే ఫ్యాన్స్‌లో ఒక్కటే చర్చ మొదలైంది. ఈ సినిమా లోకేష్ సృష్టించిన LCU (Lokesh Cinematic Universe) లో భాగం కాబోతుందా? రోలెక్స్, విక్రమ్ వంటి క్యారెక్టర్లతో బన్నీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? అనే దానిపై టీమ్ ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఒకవేళ ఇది గనుక LCU లో భాగమైతే, ఇండియన్ సినిమా రికార్డులన్నీ గల్లంతవ్వడం గ్యారెంటీ!
