ఓటిటి సంస్దలు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాయో, ఎవరికి ట్విస్ట్ ఇస్తాయో తెలియటం లేదు. తాజాగా వరుణ్‌ ధావన్‌, సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Honey Bunny) కి అర్దాంతరంగా స్వస్ది పలికారు.

ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన వెబ్‌ సిరీస్‌కి ఇండియన్‌ వెర్షన్‌గా ఇది రూపొందిన విషయం తెలిసిందే. దీని పార్ట్‌ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ సిరీస్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. దీని సీజన్‌2ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

దీనికి రాజ్ అండ్ డీకే డైరెక్టర్స్ కాగా ప్రైమ్‌లో డీసెంట్‌ హిట్ టాక్ తెచ్చుకున్న ఈసిరీస్ కు సీక్వెల్ వస్తుందనే ఇన్నాళ్లు అనుకున్నారు సమంత అండ్ సమంత ఫ్యాన్స్‌ కూడా.. ! కానీ ఇప్పుడు ఈ సిరీస్‌ సీక్వెల్‌కు సంబంధించి ఇప్పుడో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు అనౌన్స్‌ చేసింది ప్రైమ్‌ టీం.

ప్రియాంక నటించిన సిటడెల్‌ ఆధారంగానే ఇండియన్‌ వెర్షన్‌, ఇటాలియన్‌ వెర్షన్‌లు (Citadel: Diana) రూపొందాయి. తాజాగా ఈ రెండింటి కొనసాగింపులను రద్దు చేశారు. బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. ఈవిషయంపై అమెజాన్‌ ప్రతినిధులు స్పష్టత నిచ్చారు.

‘‘సిటడెల్‌: హనీ-బన్నీ, సిటడెల్‌: డయానా తదుపరి సీజన్లను నిలిపివేసి.. వాటి కొనసాగింపు కథలను మాతృకలో విలీనం చేస్తున్నాం. ఈ సిరీస్‌ అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇది ఓ భావోద్వేగ ప్రయాణం. మాతృకను మరింత గొప్పగా తెరకెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.

ఇక ప్రియాంక నటిస్తోన్న ‘సిటడెల్‌ పార్ట్‌2’ 2026లో విడుదల కానున్నట్లు చెప్పారు.

, , ,
You may also like
Latest Posts from