రామ్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఈ క్రమంలో ఓ కొత్త కథతో రామ్ రాబోతున్నాడు. రామ్, భాగ్య శ్రీ కాంబోలో మహేష్ బాబు. పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అంటూ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో సినిమా కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్పినట్టు అనిపిస్తుంది.

తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద ఫ్యాన్స్ ఈలలు, డప్పులు, కేకలతో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. టికెట్ల కోసం క్యూలైన్స్ వద్ద ఫ్యాన్స్ నానా తంటాలు పడుతుండగా.. బుకింగ్ కౌంటర్ వద్ద.. ఎమ్మార్వో, ఎమ్మెల్యే, కానిస్టేబుల్ అంటూ ఒక్కొక్కరు ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు. ఇంకా ఫోన్స్ ఎక్కువవుతుండగా.. ‘ఆంధ్ర కింగ్ సూర్య’ సినిమా ఫస్ట్ డే అని టికెట్స్ కష్టమంటూ మేనేజర్ ఫోన్‌లో ఎవరితోనో చెప్తుంటాడు.

ఇదే సమయంలో రామ్ సైకిల్‌పై గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. టికెట్స్ లేవంటూ మేనేజర్ విసుక్కుంటూ ఫోన్‌లో చెప్తుండగా.. ‘అన్నా 50 టికెట్స్’ అంటూ రామ్ అడగ్గా.. ఎవరి తాలూకా అంటూ ప్రశ్నిస్తాడు మేనేజర్. ‘ఫ్యాన్స్’ అంటూ చెప్పగా.. మేనేజర్ నవ్వుకుంటూ టికెట్స్ ఇస్తాడు. చూస్తుంటే నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోపిక్‌లానే అనిపిస్తోంది.

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ఉపేంద్ర సినిమా హీరోగా కనిపించబోతున్నారు. థియేటర్ వద్ద ఆయన భారీ కటౌట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. టికెట్స్ తీసుకుంటూ ఉపేంద్ర పోస్టర్ ముందు రామ్.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అంటూ కేకలు వేయడం ఫ్యాన్ బేస్‌ను కళ్లకు కట్టినట్లు చూపించింది. ‘ఆంధ్ర కింగ్’.. స్టార్ హీరో సూర్య అభిమానిగా రామ్ కనిపించనున్నారు.

సాగర్ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. వీరి మధ్య ఓ అందమైన లవ్ స్టోరీ కూడా ఉండబోతోందని అర్ధమవుతోంది. వివేక్ మెర్విన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.

, ,
You may also like
Latest Posts from