అవీ ఇవీసినిమా వార్తలు

CSK గూబ గుయ్‌మనిపించిన సన్ పిక్చర్స్: రజినీకాంత్ మ్యూజిక్ వాడితే కోటి రూపాయల ఫైన్?

ఐపీఎల్ 2026 సమరం మొదలవకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మైదానంలో కాకుండా కోర్టులో సిక్సర్లు తినే పరిస్థితి వచ్చింది! సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీలోని ‘హుకుం’ మ్యూజిక్ అంటే అందరికీ పూనకాలే.. కానీ అదే మ్యూజిక్‌ను తన ప్రమోషన్ల కోసం వాడేసుకున్న CSKకు సన్ పిక్చర్స్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా మా బిజియం వాడతారా అంటూ ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కోర్టు మెట్లెక్కింది సన్ నెట్‌వర్క్!

క్రికెట్ ఫీవర్ మొదలవకముందే సినిమా ఇండస్ట్రీ, ఐపీఎల్ టీమ్ మధ్య లీగల్ ఫైట్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. రజినీకాంత్ నటించిన ‘జైలర్’, ‘కూలీ’ సినిమాల మ్యూజిక్‌ను కాపీరైట్ అనుమతి లేకుండా వాడటంతో CSK ఇప్పుడు చిక్కుల్లో పడింది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సెన్సేషనల్ బీజీఎం హక్కులు సన్ పిక్చర్స్ దగ్గర ఉన్నాయి. తమ సొంత ఆస్తిని పర్మిషన్ లేకుండా కమర్షియల్ యాడ్స్ కోసం వాడటంపై సన్ టీవీ యాజమాన్యం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మైండ్ బ్లాక్ అయ్యే లీగల్ ట్విస్ట్ :

ఈ వివాదం ఎంతవరకూ వెళ్ళిందంటే, ‘జైలర్’ లోని ఫేమస్ డైలాగ్ మరియు ‘కూలీ’ టీజర్ మ్యూజిక్‌ను CSK తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వాడింది. దీనివల్ల తమకు రావాల్సిన ఆదాయానికి గండి పడిందని, అందుకే రూ. 1 కోటి నష్టపరిహారంతో పాటు ఆ వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు కూడా వెల్లడించాలని సన్ పిక్చర్స్ డిమాండ్ చేస్తోంది. ఈ దెబ్బతో CSK యాజమాన్యం ఒక్కసారిగా ఖంగుతిన్నది.

కోర్టులో CSK వెనకడుగు:

మద్రాస్ హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగానే CSK తరఫు లాయర్లు డిఫెన్స్‌లో పడిపోయారు. సన్ పిక్చర్స్ అనుమతి లేకుండా మ్యూజిక్ వాడిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ, ఇప్పటికే సోషల్ మీడియా నుంచి ఆ వివాదాస్పద వీడియోలను తొలగించామని కోర్టుకు తెలిపారు. ఇకపై సన్ నెట్‌వర్క్‌కు చెందిన ఏ కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడబోమని, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఐపీఎల్ 2026 అప్‌డేట్:

ఈ లీగల్ రచ్చ ఇలా ఉండగానే, ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఖరారైంది. మార్చి 28న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఒకవైపు ఐపీఎల్ సందడి మొదలవుతుంటే, మరోవైపు ఇలాంటి కాపీరైట్ వివాదాలు టీమ్‌ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.

ఎవరి క్రియేటివిటీ అయినా వారి ఆస్తి అని, దాన్ని స్టార్ టీమ్ కదా అని వాడేసుకుంటే చట్టం వదిలిపెట్టదని సన్ పిక్చర్స్ నిరూపించింది. ప్రస్తుతం ఈ కేసు వచ్చే వారానికి వాయిదా పడింది. CSK ఈసారి అఫిడవిట్ దాఖలు చేసి ఈ గండం నుంచి బయటపడుతుందో లేదో చూడాలి!

Similar Posts