టాలీవుడ్ వెండితెరపై దశాబ్ద కాలంగా సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న.. ‘అనుష్క పెళ్లి ఎప్పుడు?’. ఏడాదికి పది వార్తలు వచ్చినా, చివరకు అన్నీ తుస్సుమంటూనే ఉన్నాయి. కానీ, ఈసారి వస్తున్న అప్డేట్ చూస్తుంటే నెటిజన్ల ఫ్యూజులు అవుట్ అవ్వడం ఖాయం. దేవసేన ఇక బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి, ఆ పారిశ్రామికవేత్త ఇంటికి కోడలిగా వెళ్తోందా? ఈసారి మేటర్ చాలా సీరియస్ అట!
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. బాహుబలి తర్వాత ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది. అయితే, కెరీర్ ఎంత పీక్స్‌లో ఉన్నా ఆమె పెళ్లి మాత్రం ఎప్పుడూ ఒక మిస్టరీనే. గతంలో ప్రభాస్‌తో పెళ్లి అంటూ ఊదరగొట్టారు, కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇప్పుడు 44 ఏళ్ళ వయసులో అనుష్క మళ్ళీ పెళ్లి వార్తలతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. కొంతకాలంగా మీడియాకు, సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న స్వీటీ.. సైలెంట్‌గా తన పెళ్లి పనులు కానిచ్చేస్తోందని ఫిలిం నగర్ టాక్.

మైండ్ బ్లాక్ అయ్యే అసలు మేటర్ :
తాజా సమాచారం ప్రకారం, అనుష్క తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బెంగళూరుకు చెందిన ఒక బడా పారిశ్రామికవేత్త కుమారుడితో ఏడడుగులు వేయబోతోంది. ఈసారి కేవలం రూమర్స్ మాత్రమే కాదు, డేట్ కూడా ఫిక్స్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె ‘ఘాటీ’ వంటి సినిమాల ప్రమోషన్లకు కూడా రాకుండా, దర్శకులకు కూడా అందుబాటులో లేకుండా పోయింది. హైదరాబాద్ నుంచి తన మకాంను బెంగళూరుకు మార్చేసి, అక్కడ తన సొంత బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ్యాన్స్ షాక్:
‘సైజ్ జీరో’ తర్వాత హెల్త్ మరియు వెయిట్ ఇష్యూస్ వల్ల ఆమె సినిమాల్లో వేగం తగ్గించినా, ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ 44 ఏళ్ళ వయసులో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభాస్‌తో కాకపోయినా, ఇప్పటికైనా ఒక ఇంటిది అవుతున్నందుకు కొందరు సంతోషిస్తుంటే, మరికొందరు మాత్రం ఆ పారిశ్రామికవేత్త ఎవరై ఉంటారా? అని గూగుల్‌లో వెతుకులాట మొదలుపెట్టారు.
ఇప్పటివరకు వచ్చిన వందలాది రూమర్ల లాగే ఇది కూడా మిగిలిపోతుందా లేక ఈసారి నిజంగానే స్వీటీ శుభవార్త చెప్తుందా? అనేది సస్పెన్స్. ఏది ఏమైనా అనుష్క పెళ్లి పీటలెక్కితే అది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ వెడ్డింగ్ అవ్వడం ఖాయం. స్వీటీ నుంచి అఫీషియల్ అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిందే!

