ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటికే ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు రెహమాన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.
వర్క్ విషయానికి వస్తే.. రెహమాన్ ఇటీవల ‘ఛావా’ చిత్రానికి సంగీతం అందించారు.
ప్రస్తుతం ఆయన ‘ఆర్‌సీ 16’ కోసం వర్క్ చేస్తున్నారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. దీని కోసం ఇప్పటికే తాను రెండు పాటలు కంపోజ్ చేసినట్లు ఆయన ఇటీవల వెల్లడించారు.