బాలయ్య బాబు రచ్చ మళ్లీ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలా ఉంటుందో తెలుసా? శివతాండవం ఊపెక్కబోతుంది! బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ అభిమానులకు పండుగే. ఇప్పుడు ఆ క్రేజ్ మరో లెవెల్‌లోకి వెళ్లింది. “అఖండ 2: తాండవం” సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇప్పుడు ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ మధ్య చర్చలేంటి అంటే – “సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందా? లేక డిసెంబరుకి వాయిదా పడుతుందా?” అన్న సందేహమే. కానీ ఈ గందరగోళానికి ముగింపు పలికారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.
“సెప్టెంబర్ 25నే అఖండ 2 వస్తుంది!” – బోయపాటి కన్‌ఫర్మేషన్
ఖమ్మంలో బాలయ్య ఫ్యాన్స్‌ను కలిసిన బోయపాటి శ్రీను, సినిమా షూటింగ్ తర్వాత వారితో చిట్‌చాట్ చేశాడు. భోజనం పంచుకుంటూ ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చాడు – “రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు. అఖండ 2 సెప్టెంబర్ 25నే థియేటర్స్‌లోకి వస్తుంది.” అని స్పష్టంగా చెప్పారు. ఈ విడుదల తారీఖు నందమూరి అభిమానులకే కాదు, మాస్ ఆడియెన్స్‌కి కూడా ఒక సెలబ్రేషనే అవుతుందని తెలిపారు.
అఖండ 2: తాండవం – భారీ బడ్జెట్, పవర్‌ఫుల్ కాస్ట్
నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ అచంటా, గోపి అచంటా
ప్రెజెంటర్: బాలయ్య చిన్న కూతురు ఎం. తేజస్విని
కథానాయికలు: ప్రగ్యా జైస్వాల్ (మళ్లీ తన పాత్రలో), సంయుక్త మీనన్
ప్రత్యేక ఆకర్షణ: హర్షాలి మల్హోత్రా (బజరంగీ భాయ్‌జాన్ ఫేమ్)
ముఖ్య పాత్రలో: ఆది పినిశెట్టి
సంగీతం: తమన్
తాజా షెడ్యూల్: మరేడుమిల్లి అడవుల్లో, కీలక సన్నివేశాలతో షూటింగ్ పూర్తి
ఇప్పుడు ఫ్యాన్స్‌కు క్లీన్ కట్ క్లారిటీ ఉంది – అఖండ 2 ఎక్కడికీ వెళ్ళదు, సెప్టెంబర్ 25నే వస్తుంది! ఇక కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. జై బాలయ్య!