అఖండ… 2021లో ఒక సినిమా కాదు, ఒక తాండవం! పండగలా వచ్చి, బాక్సాఫీస్‌ను దాటి పోయిన రథం లా దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లు వసూలు చేసి బాలయ్య పవర్ ఏంటో మరోసారి చూపించింది. ఇప్పుడు అదే జాతరకు సీక్వెల్ రూపంలో రాబోతున్న చిత్రం – అఖండ 2 – తాండవం!
మొదటి భాగం ఇచ్చిన మాస్ హైపే కాదు, అఘోర పాత్ర బాలయ్య కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ‘అఖండ 2’ను రూపొందిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం, జార్జియాలో కీలక షెడ్యూల్ మొదలైపోయింది. ఇందులో ఓ హై ఎనర్జీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌కు ప్రత్యేకత ఏమిటంటే, ఇదే సీన్లో బాలకృష్ణ సెకండ్ రోల్‌పై క్లారిటీ వస్తుందట.
ఈ సారి మరింత గాంభీర్యంగా, మరింత శక్తిగా తిరిగొస్తున్నాడు అఘోర బాలయ్య. అభిమానుల్లో వేరే స్థాయిలో హైప్. ప్రతి అప్డేట్ కోసం కళ్లకాచి చూస్తున్నారు.
ఇంతలోనే ఒక చిన్న ట్విస్ట్…
మేకర్స్ మొదటగా సెప్టెంబర్ 25న భారీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన OG కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో, భారీ క్లాష్ జరగనుంది. దీనివల్ల అఖండ 2 మేకర్స్ ఆ డేట్‌ను మార్చే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం డిసెంబర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
కానీ అదే డిసెంబర్ 5న ప్రభాస్ నటించిన The Raja Saab రిలీజ్ అవుతుంది అని వార్తలు రావడంతో, బాలయ్య చిత్రానికి మరో తేదీ కోసం జల్లెడ పట్టిస్తున్నారు. ఇప్పుడు రెండు ఆప్షన్స్ క్రమంగా ముందుకొస్తున్నాయి.
👉 క్రిస్మస్ సీజన్
👉 లేదా వచ్చే సంక్రాంతి సీజన్!
ఇంకా అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్. బాలయ్య అభిమానులకు ఇది మరొక పవర్ ప్యాక్డ్ ఫెస్టివల్ అవుతుందని ఖాయం!