దక్షిణ భారత ప్రముఖ నటి త్రిషా ఇంటి మీద షాకింగ్ బాంబ్ బెదిరింపు వెలుగుచూసింది. చెన్నైలోని ఆమె నివాసంతో పాటు, గవర్నర్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, బీజేపీ ప్రధాన కార్యాలయం కూడా ఆ బెదిరింపు లిస్టులో ఉన్నట్టు సమాచారం.

తక్షణమే పోలీసులు దర్యాప్తు చేపట్టి అది హోక్స్ (తప్పుడు బెదిరింపు) అని తేల్చేశారు. అయినప్పటికీ, ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని ప్రదేశాల వద్ద, ముఖ్యంగా త్రిషా ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇక వ్యక్తిగత జీవితంలో త్రిషా ఇంకా పెళ్లి కాలేదు, ఆమె తన తల్లితో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు.

వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, త్రిషా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “విశ్వంభర” లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

, , , , ,
You may also like
Latest Posts from