కాస్త ఆలస్యమైనప్పటికీ… కేంద్ర ప్రభుత్వం అశ్లీల కంటెంట్‌పై పెద్ద ఎత్తున గట్టి చర్య తీసుకుంది. సినిమా పేరుతో అసలైన పోర్న్‌కు తలుపులు తీస్తున్న పలు యాప్‌లు, వెబ్‌సైట్‌లపై నిషేధం విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఉల్లూ, ALTBalaji, బిగ్‌షాట్స్, దేశీఫ్లిక్స్, బూమెక్స్, నవరసా లైట్, హాట్‌ఎక్స్ VIP వంటి మొత్తం 25 యాప్‌లు, వెబ్‌సైట్లపై బ్యాన్ అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది.
అశ్లీల కంటెంట్‌కు ఇక దారిలేదు!
ఇప్పుడు నిషేధంలో పడిన ఈ యాప్‌లు — కొన్ని సాఫ్ట్ పోర్న్, మరికొన్ని డైరెక్ట్‌గా పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తున్నట్లు సమాచార ప్రసార శాఖ వెల్లడించింది. వాటి ద్వారా వినియోగదారులకు డబ్బులు తీసుకొని అభ్యంతరకరమైన వీడియోలు, సినిమాలు అందించారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ISP లకు స్పష్టమైన ఆదేశాలు
ఈ యాప్‌లు, వెబ్‌సైట్లు ఇకపై అందుబాటులో ఉండకూడదని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISPs) కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు వాటిని యాక్సెస్ చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది.
సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
ఇలాంటి కంటెంట్ ఓపెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో, ముఖ్యంగా ‘X’(ట్విటర్) వంటివాటిలోకి కూడా చొచ్చుకుపోవడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సందర్భంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో హర్షాతిరేకాలను రేపుతోంది.
ఏయే చట్టాల ప్రకారం నిషేధం?
ఈ యాప్‌లు భారత చట్టాలను లంఘించాయంటూ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 – సెక్షన్ 67, 67A, భారత న్యాయ సంహిత సెక్షన్ 294, ఇన్‌డీసెంట్ రిప్రెజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (నిషేధం) చట్టం, 1986 – సెక్షన్ 4 ప్రకారం నిషేధం విధించినట్టు కేంద్రం తెలిపింది.
నిషేధిత యాప్‌లు/వెబ్‌సైట్‌ల జాబితాలో ఉన్నవి:
ఉల్లూ, ALTBalaji, Big Shots, Desiflix, Boomex, Navrasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalwa App, Wow Entertainment, Look Entertainment, Hitprime, Pheneoh, ShowX, Soul Talkies, Adda TV, HotX VIP, Hulchal App, MoodX, NeonX VIP, Phoogi, MozFlix, Triflix
సాధారణ వినోదం పేరుతో అశ్లీలతకు వేదికగా మారిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం ఇచ్చిన షాక్ ఇది. ఇప్పుడు ఇది శుభ ప్రారంభం అవుతుందా? లేదా మరో మార్గంలో అవి తిరిగి వస్తాయా అన్నది వేచిచూడాలి.