ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ‘వార్ 2’ కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్ చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ లో క్రేజీ సీక్వెన్స్ లు ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ నడుమ ఎపిక్ క్లాష్ సన్నివేశాలు అదిరిపోయాయి.
దర్శకుడు అయాన్ లేటెస్ట్ గా వీటిపైనే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వార్ 2 లో తనకి బాగా క్లిష్టమైన పని ఏదన్నా ఉంది అంటే అది లీడ్ హీరోస్ మధ్య ఘర్షణ సన్నివేశాలు కోసమే అని చెప్పుకొచ్చారు. ఇద్దరు మధ్య యాక్షన్ సీక్వెన్స్ లు కోసం క్రియేట్ చేయాల్సిన పరిస్థితిలు ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించింది అని చెప్పారు.
అలాగే “ఇది ఒక సీక్వెల్ మాత్రమే కాదు… వార్ ఫ్రాంచైజీని గౌరవిస్తూ, దాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్లే ప్రయోగం కూడా.”
అయాన్ చెప్పినట్టు, ఈ సినిమా డైరెక్ట్‌గా తొలి భాగాన్ని ఫాలో అవ్వదు. బదులుగా, పూర్తి స్థాయి భావోద్వేగాలకి, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లకి మిళితం చేసిన భారీ విజన్‌తో రూపొందించారు.
“ఇది మామూలు సీక్వెల్ కాదు. ప్రతి సన్నివేశం, ప్రతి యాక్షన్ బ్లాక్, ప్రతి ఎమోషన్… అన్నీ ముందున్న ప్రమాణాలను మించి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం,” అన్నారు అయాన్.
హృతిక్-ఎన్టీఆర్‌ల క్రేజీ కాంబినేషన్ వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అవి నెరవేర్చాలంటే పక్కా స్క్రీన్‌ప్లే, విజువల్స్ కావాలి.
“ఇది ఇండియన్ సినిమా పరాకాష్టకి ఒక సెలబ్రేషన్ లాంటిది,” అంటూ అయాన్ ఉత్సాహంగా చెబుతున్నారు. “ప్రేక్షకులకి ఇది ఒక థియేట్రికల్ రైడ్ లా అనిపిస్తుంది. మేము ప్రతీ ఫ్రేమ్‌లో మా 100 శాతం పెట్టాం.” అన్నారు.
దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2, యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందుతోంది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.